ఇద్దరి తప్పుడు పనుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వచ్చింది… కేటీఆర్‌

పేపర్ లీకేజీ దురదృష్టకర గటన..

పేపర్ లీకేజీ పై అన్ని వివరాలు సీఎం తో చర్చించాం..

155 నోటిఫికేషన్ ల ద్వారా 35వేల ఉధ్యోగాలు టీఏస్ పీఏస్సీ ద్వారా నియామకం జరిగింది.

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రతీ నిరుద్యోగికి ఈజీ చేసాం..

99 కంప్యూటర్ బేస్ పరీక్షలు నిర్వహించాం…

7 భాషల్లో ఓకే సారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఏస్ పీఏస్సీ ది..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియామక బోర్డు పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి..

పక్షపాత ధోరణి వల్ల నష్టపోవద్దని ఇంటర్వ్యూ సిస్టం ను రద్దు చేసాం..

ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు…వ్యవస్థ కే చెడ్డపేరు తెచ్చింది

యువతకు భరోసా ఇవ్వాల్సిన భాధ్యత మా పై ఉంది కాబట్టే.. ఇంత మంది మంత్రులం వచ్చి మాట్లాడంతున్నాం..

ప్రవీణ్, రాజశేఖర్ మాత్రమే కాదు.. వారి వెనక ఎవరు ఉన్న కఠినంగా శిక్ష పడేలా చేస్తాం..

ఇది సిస్టం ఫేల్యూర్ కాదు.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు

మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత పడుతాం..

కొత్త సంస్కరణలు తీసుకొస్తాం..

రద్దైన నాలుగు పరీక్ష లకు అప్లై చేసుకున్న వారందరూ మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు..

వీలైనంత త్వరగా రద్దైన పరీక్షలు నిర్వహిస్తాం..

రధ్ధైన నాలుగు పరీక్షల స్టడీ మెటీరియల్ ను ఆన్ లైన్ లో అందుబాటులో పెడతాం..

స్టడీ సర్కిల్ లను బలోపేతం చేస్తాం..

రీడింగ్ రూమ్స్ 24 గంటలు తెరచే ఉంటాయి..అక్కడే బోజన సదుపాయం కల్పిస్తాం.

వ్యవస్థ పటిష్టం గా ఉంది.. ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పే..

యువతను రెచ్చగొట్టే విధంగా ,ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చే విధంగా కొందరు మాట్లాడుతున్నారు..

రాజకీయ నిరుద్యోగులు చేసే వాఖ్యలను యువత పట్టించుకోవద్దు..

బీఆర్ఎస్ పార్టీ తరుపున డీజీపీ కి ఫిర్యాదు చేసాం.

రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీలక కార్యకర్త..

రాజశేఖర్ వ్యవహారం పై లోతుగా దర్యాప్తు చేయాలని డీజీపీ ని కోరుతున్నా..

రాజశేఖర్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యక్తి..

బీజేపీ పై మాకు అనుమానం ఉంది..

నోటిఫికేషన్ ల పై కుట్ర చేసారనే అనుమానం ఉంది..

ఎన్నికలు కొద్దీ రోజుల్లోనే ఉన్నాయి.. ప్రజల కు ఎవరు ఏంటో తెలుసు.

కేంద్రం లో 16 లక్షల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు.

పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ప్రభుత్వం పాత్ర ఉండదు.. కాన్సిట్యూషన్ బాడీ..

ప్రతీ దానికి ఐటీ మినిస్ట్రీస్ దే భాధ్యతా..

ఎక్కడో తప్పు జరిగితే నేను రాజీనామా చేయాలా..

ఐటీ మినిస్టర్ ఏం చేస్తడో వీల్లకు తెలుసా..

గుజరాత్ లో ,అస్సాం లో పేపర్ లీకైయింది..అక్కడి మంత్రి రాజీనామా చేసాడా

పరీక్ష లో క్వాలిఫై అయిన పిల్లలు పెద్ద మనసుతో అర్దం చేసుకోవాలి.

సిట్ విచారణ పూర్తి కాలేదు.. అనుమానం ఏమున్నాయో చెప్పండి నివృత్తి చేస్తాం.