CM KCR కు తెలంగాణ ప్రజలు జన్మంత రుణపడి ఉంటారు… మంత్రి హరీష్ రావు

CM KCR కు తెలంగాణ ప్రజలు జన్మంత రుణపడి ఉంటారు… మంత్రి హరీష్ రావు

పెద్దవాగును ముద్దాడిన గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు సాకారంతో మరో చారిత్రాత్మక జల ఘట్టం అవిష్కృతం.

రంగనాయక రిజర్వాయర్ నుండి పరుగులు పెట్టిన గోదారమ్మ నంగునూరు మండలంలోని 5 చెక్ డ్యాములకు ఇక నిరంతర జలకళ.

సీఎం కేసీఆర్ ముందుచూపు.. మంత్రి హరీష్ రావు సంకల్పంతో నిండుకుండలుగా చెక్ డ్యాములు..

గంగమ్మకు జల జాతర చేసేందుకు సంబరాలకు సిద్ధమైన రైతులు.

ఇప్పటిదాకా మానేరు నుండి వాగుల్లోకి గోదావరి జలాలు.. ఇకపై వాగుల్లో నుండి మానేరు రిజర్వాయర్ కు కాళేశ్వరం జలాలు.

సంతోషం వ్యక్తం చేస్తూ…త్వరలో రైతుల తో కల్సి జల జాతర.. నీళ్ల ఉత్సవం…

పండుగల జల పండగ చేద్దాం ఆనందం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు..

– సీఎం కేసీఆర్ జన్మత ఋణపడి ఉంటాం… జన్మచరితార్థం అయిన సంతృప్తి ఉంది.. ..

రెండు పంటలకు నిండు కుండల్లా వాగులు ..చెక్ డ్యామ్ లు చెరువు లు..

ఆర్థిక బాధలు, ఆత్మహత్యలతో అల్లాడిన తెలంగాణ రైతాంగం కన్నీళ్ళు తుడిచేందుకు సాకారమైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా మరో చారిత్రాత్మక జల ఘట్టం అవిష్కృతమైంది. మన నీళ్లు మన బీళ్లను తాకాలనే తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ లక్ష్యం నెరవేరుతుందనడానికి పల్లెపల్లెన పరుగులు పెడుతున్న గోదావరి జలాలే సజీవ సాక్ష్యం. కుండపోత వర్షాలకు మాత్రమే తడిసి ముద్దయ్యే నంగునూరు పెద్ద వాగు ను కాళేశ్వరం జలాలు స్పృశించడం జల రికార్డుగానే భావించాలి. ఇప్పటిదాకా గోదావరి జలాలు మానేరు వాగు నుండి వాగుల్లోకి పరుగులు పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు సాకారం వల్ల రంగనాయక సాగర్ నుండి పెద్ద వాగు ద్వారా పదుల సంఖ్యలో గ్రామాల భూములను తడుపుతూ మానేరు రిజర్వాయర్ లో కలవడం నిజంగా అద్భుత ఘట్టమే. గోదావరి జలాలకు కొత్త నడక నేర్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షాదక్షత కు రుణపడి ఉంటామని రైతులంతా ఆనందోత్సవాలకు సిద్ధమవుతున్నారు.

సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం లోని పెద్ద వాగును గోదారమ్మ మండుటెండల్లో ముద్దాడి పరవళ్లు తొక్కుతుంది.. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు నాయకత్వం సాగు నీటి రంగానికే ఆదర్శంగా నిలిచిన ఎన్నో ఘట్టాలు ఎన్నో.. సాగు నీటి కి.. నదికే కొత్త నడక నేర్పిన చరిత్ర సీఎం కేసీఆర్.. బి ఆర్ ఎస్ ప్రభుత్వం ది.. నాడు సాగు నీటి లెక అల్లాడిన ప్రాంతం.. సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు ముందు చూపుతో ఘనపూర్ ,అక్కేనపల్లి చెక్ డ్యామ్ లను నిర్మించి నేడు కాళేశ్వరం జలా ఫలాలు అందాయి అందుకు నిదర్శనం పెద్దవాగు సాక్ష్యం..

5 చెక్ డ్యామ్ లు… 5వేల ఎకరాలు సాగు నీటి జలకళ..

నంగునూరు మండలంలోని పెద్దవాగుపై 9 చెక్ డ్యాములు కలవు ప్రస్తుతం రంగనాయక సాగర్ కుడి కాలువ నీటితో ఐదవ చెక్ డాం అయినా పెద్దోళ్ల బావి చెక్ డ్యామ్ లోకి ప్రస్తుతం నీరు నాగరాజు పల్లి చౌటచెరువు మత్తడి దూకి పెద్దోళ్ల బావి చెక్ డాం పై భాగంలోకి నీరు వచ్చి చేరుచున్నది ఈ చెక్ డాం నిండిన తర్వాత దిగువ గల మరో నాలుగు చెక్ డ్యాములు నిండి 1200 ఎకరాలకు నీరు అందించ గలం మరియు వాగు అవతలి గ్రామాలకు దాదాపు 5వేల ఎకరాలు ఆయకట్టుకు నీరు అందించబడును మరియు భూగర్భ జలాల ద్వారా మరో 1200 ఎకరాల ఆయకట్టు లబ్ధి చేకూ రూను.
నంగునూరు మండలంలోని 25 చెరువులు కుంటలు మరియు ఐదు చెక్ డ్యాములు రంగనాయక సాగర్ కుడి కాలువ ద్వారా నీరు నింపడం జరిగినది ఇందులో ఐదు చెక్ డ్యాములు మరియు ఐదు చెరువులు మత్తడి దుంకుతున్నాయ్…

గతంలో పెద్ద వాగులోకి నీరు చిట్యాలనాల మరియు దొమ్మాట నాలా రెండు నాళాలు అర్జున్ పట్ల ఆకునూరు మధ్యలో కలిసి పెద్ద వాగుగా ఏర్పడి శనిగరంలో కలిసి శనిగరం నుండి లోయర్ మానేరు ద్వారా గోదావరిలోకి నీరు అందేవి ఇప్పటిదాకా మానేరు నుండి వాగుల్లోకి గోదావరి జలాలు.. ఇకపై వాగుల్లో నుండి మానేరు రిజర్వాయర్ కు కాళేశ్వరం జలాలు
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరే పెద్ద వాగుకి సుమారు 390 మీటర్లు లిఫ్టు ద్వారా పెద్దవావిలోకి నీళ్లు వచ్చి చేరుచున్నవి.

త్వరలో రైతులతో కల్సి జల జాతర..

జన్మ చరితార్థం అయిన సంతృప్తి ఉంది…

ఆనందం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు.

అభివృద్ధి అంటే గొప్ప తృప్తి మనం చేసిన పనిలో సార్థకత వచ్చినప్పుడు అని.. అంతటి గొప్ప సంతృప్తి ఈరోజు కనపడుతుంది.. అదే కాళేశ్వరం జలాలు కలలో కూడా చూస్తామా లేదా అన్న నానుడి నుండి నేడు కళ్ళ ముందు సజీవ సాక్ష్యం నిలిచింది.. నాడు ముందు చూపుతో సీఎం చెక్ డ్యామ్ నిర్మించడం నేడు కాళేశ్వర జలాల తో సఫలం అయింది.. నేడు రైతు కళ్ళల్లో కాళేశ్వర జలాలతో చెరువు చెక్ డ్యామ్ లు జల కళతో విరాజిల్లుతున్నాయి.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు.. త్వరలోనే పెద్ద వాగు పై రైతులతో కల్సి జల జాతర… నీళ్ల పండుగ సంబరంగా ఉత్సవం ల చేస్తామని మంత్రి చెప్పారు.. ఇది గొప్ప చారిత్రత్మకం .. మండుటెండల్లో నిండు కుండల్లా చెరువు చెక్ డ్యామ్ లు పరవళ్లు తొక్కడం ఒక చరిత్ర అని ఇది సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ ప్రభుత్వ పనికి గొప్ప నిదర్శనం అని అన్నారు..