ఈ మధ్యకాలంలో కొందరు పోలీసులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. బాధ్యత గత వృత్తిలో ఉన్నామన్న సోయి మరిచి హద్దులు దాటుతున్నారు. రోడ్లపై తాగుతూ దొరకడం, అర్థరాత్రి యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి ఘటనలు మనం అనేకం చూశాం.
అయితే ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో ఆఫీసర్ దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను ఇష్టమొచ్చినట్లుగా పోలీస్ స్టేషన్ లోనే దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? పంజాబ్ లోని మొహాలి జిల్లా జిరాక్ పూర్ లో అశిష్ కుమార్ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే గతంలో ఓ కేసులో భాగంగా ఇతడు ఓ మహిళ నుంచి ఏకంగా రూ.1 కోటి రూపాయలు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత మహిళ ఇదే అంశాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. అయితే ఇందులో భాగంగానే పోలీస్ ఆఫీసర్ బాధిత మహిళను కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడయోను ఆమె తాజాగా కోర్టులో సమర్పించింది. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో అధికారులు అశిష్ కుమార్ ను సస్పెండ్ చేశారు. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.