సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు,అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు

జగిత్యాల జిల్లా…

సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు,అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినా, ఫోటోలు మార్ఫింగ్ చేసినా కఠిన చర్యలు

కేసులు నమోదు చేయటం తో పాటు శిక్షలు పడేలా వేగవంతంగా విచారణ….. జిల్లా SP శ్రీ ఎగ్గడి భాస్కర్.

అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టటం.. విద్వేషపూరితంగా సందేశాల్ని వ్యాప్తి చేయటం.. ఫోటోల్ని మార్ఫింగ్ చేసే ఉదంతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు.సోషల్ మీడియాలో అసత్యాల్ని వ్యాప్తి చేసే వారి పై కేసుల్ని నమోదు చేయటంతో పాటు.. వేగవంతంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు .కొందరు ఇతర దేశాలలో ఉంటూ సోషల్ మీడియాలో ఏం చేసినా తమకేం కాదన్న ధీమాతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపైనా కేసులు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేయొచ్చన్నారు. అలాంటి వారి పాస్ పోర్టులు.. వీసాలను కూడా రద్దు చేయించొచ్చని చెప్పారు. పోలీస్ శాఖ లో ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా పోస్టు పెట్టే వారిని పట్టుకోవడం చాలా తేలిక అని తెలిపారు.ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పోస్టులను వాట్సాప్ మరియు ఫేస్బుక్ ల ద్వారా చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. ప్రజా భద్రత ,లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జగిత్యాల జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం అన్నారు .