మంచిర్యాల :
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
వివరాలు… మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని సాయిష్మ కోరినా.. యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.