ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. ముగ్గురికి పద్మవిభూషణ్, నలుగురికి పద్మభూషణ్..
ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన విజయ్ గుప్తా తదితరులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ఫంక్షన్ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణకు పద్మవిభూషణ్ అవార్డును బహుకరించారు. మొత్తం 54 మందికి తొలివిడతలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు.
తెలంగాణకు చెందిన కమలేశ్ డి పటేల్‌కు సామాజిక సేవారంగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అదే రంగంలో ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్, శాస్త్రసాంకేతిర రంగాల్లో తెలంగాణకు చెందిన విజయ్ గుప్తాకు పద్మశ్రీ లభించింది. తెలంగాణాకే చెందిన సాహితివేత్త రామకృష్ణారెడ్డికి, డాక్టర్ హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డులను బహుకరించారు