ప్రజల కోసమే పోలీసులు… రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

ప్రజల కోసమే పోలీసులు… రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ….

నార్సింగి నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం…

హాజరైన డా.రంజిత్ రెడ్డి, ఎంపి చేవెళ్ళ….

సైబరాబాద్ :

ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా లోని రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగిలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, చేవెళ్ళ ఎంపీ డా.రంజిత్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్సీ వాణీదేవి, తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్, టి. అనిత హరినాథ్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ రంగారెడ్డి, రేఖా యాదగిరి, చైర్ పర్సన్ నార్సింగి మున్సిపాలిటీ, వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, బండ్లగూడ జాగీర్ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు శివారెడ్డి, ఆదిత్య రెడ్డి, శ్రీకాంత్, మైలారం నాగపూర్ణ శ్రీనివాస్, నాయకులు, టీఎస్పీఏ డైరెక్టర్ సందీప్ శాండిల్యా, సైబరాబాద్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, డిసిపి రాజేంద్రనగర్ జగదీశ్వర్ రెడ్డి, ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీ సాధన రష్మి పెరుమాళ్, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ ఏదుల, నార్సింగి ఏసిపి జి. వి రమణ గౌడ్, నార్సింగి పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ వి. శివ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి మాట్లాడుతూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.