CPR ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి… మంత్రి కొప్పుల
లైఫ్ సేవింగ్ టెక్నిక్ సి.పి.ఆర్. చేసి నిండు ప్రాణం కాపాడాలి… మంత్రి కొప్పుల.
సిపిఆర్ నిర్వహణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలి… మంత్రి కొప్పుల.
మంత్రి హరీష్ రావు నేతృత్వంలో దేశానికి ఆదర్శంగా వైద్య శాఖ పనితీరు మెరుగు పడింది… మంత్రి కొప్పుల.
ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రుల అభివృద్ధి, డయాగ్నిస్టిక్ సెంటర్ ఏర్పాటు.
సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.
ప్రజల ప్రాణాలు సంరక్షించేందుకు ఉపయోగపడే సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిపిఆర్ శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…..
ఇటీవల కాలంలోఆకస్మికంగా గుండెపోటు వచ్చి చాలామంది మరణిస్తు న్నారని, యువకులు కూడా గుండెపోటుతో మరణించడం విషాదకరమని, ఆకస్మిక గుండెపోటు సమయంలో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు సంరక్షించే అవకాశాలు 50 శాతం మెరుగవుతాయని మంత్రి అన్నారు.
సిపిఆర్ చేసే విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించి పకడ్బందీగా అమలు చేస్తున్నదని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ పై అవగాహన పెంచుకొని ఇతరులకు తెలియజేయాలని, సిపిఆర్ చేసి ఒక మనిషిని కాపాడడం వల్ల వారి కుటుంబానికి సైతం మేలు చేసిన వారవుతామని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో మంత్రి హరీష్ రావు నాయకత్వంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించేలా టీ డయాగ్నస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య శాఖలో చాలా మార్పులు తీసుకుని వచ్చామని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య దాదాపు 70 శాతం చేరుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో వైద్య, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, వైద్య శాఖలో మనం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల వారు పరిశీలించి వారి రాష్ట్రాలలో అమలుకు ప్రయత్నిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి తెలిపారు.
రాజకీయ నేపథ్యంలో కాకుండా ప్రజా అవసరాలే ప్రధమంగా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిపిఆర్ శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టిందని, వీటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని అవగాహన పెంచుకొని అత్యవసర సమయంలో ఇతరులకు ప్రాణదాతలుగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రేణుక, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ , సర్పంచ్ లు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.