నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సూటి ప్రశ్నలు…
1. నాకు కేంద్ర మంత్రి పదవి లేదా బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని డిఎస్ గారికి చెప్పి గత కొన్ని నెలలుగా నీ తండ్రిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా అడ్డుకున్నది నువ్వు కాదా…!
2. తన ఆరోగ్య పరిస్థితిపై తనకు నమ్మకం లేక, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ఎలాంటి పదవులు ఆశించకుండా చనిపోతే తన భౌతిక దేహం పై కాంగ్రెస్ జెండా ఉండాలన్న కోరికతో నీ తండ్రి డిఎస్ గారు నీకు సమాచారం లేకుండా కాంగ్రెస్ లో చేరబోతున్న గంటల ముందు నీ తండ్రిగారి కాంగ్రెస్ లో చేరిక విషయం తెలుసుకుని, నీ తండ్రి గారి లెటర్ హెడ్ పై నువ్వు దొంగతనంగా పత్రిక ప్రకటన ఇచ్చింది వాస్తవం కాదా…!
3. నీ తండ్రిగారి కాంగ్రెస్ లో చేరికతో నీ రాజకీయ భవిష్యత్ (కేంద్ర మంత్రి పదవి లేదా రాష్ట్ర అధ్యక్ష పదవి) రాదన్న బెంగతో నిన్న నీ తండ్రి గారితో ఒత్తిడి తెచ్చి బలవంతంగా రాజీనామా లెటర్ పై సంతకం చేయించింది నువ్వు కాదా…!
4. ప్రపంచంలో ఎక్కడైనా ఏ వ్యక్తికైనా ఫిట్స్ వస్తే వారిని హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ మీ తండ్రి గారికి ఫిట్స్ వచ్చినప్పుడు వీడియో తీయడంలో అర్థమేంటి..!
5. గాంధీభవన్లో వందలాదిమంది మీడియా ప్రతినిధుల సమక్షంలో కాంగ్రెస్లో చేరికపై డీఎస్ గారు చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్లో చేరిన తర్వాత వారి మొహంలో సంతోషం నువ్వు చూడలేదా…!
6. గాంధీభవన్ లో డిఎస్ గారు కాంగ్రెస్ లో చేరినప్పుడు వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు, కాంగ్రెస్ లో చేరి 24 గంటలు గడవకముందే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న డిఎస్ గారి ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి..? డిఎస్ గారిపై ఎవరైనా దాడి చేశారా..? లేక డిఎస్ గారిని కొట్టారా..? గాయాలు ఎలా అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.!
7. నిన్నటి వీడియోలో క్లియర్గా నువ్వే చెప్పావు నేను కట్టర్ బిజెపి..! మా తండ్రిగారు కట్టర్ కాంగ్రెస్ అని చెప్పారు. కట్టర్ కాంగ్రెస్ వ్యక్తి అయినప్పుడు సంతోషంగా కాంగ్రెస్ లో చేరిన వ్యక్తి 24 గంటలు గడవకముందే పెరాల్సిస్ తో రాయలేని స్థితిలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి ఎలా ఉత్తరం రాశారు…!
పై ప్రశ్నలపై ఓ బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న నువ్వు నీ కుమారుల మీద ప్రమాణం చేసి జవాబులు చెప్పగలవు.!