పట్టణాల్లో నిర్మించిన ఫ్లై ఓవర్ల కింద ఆట స్థలాలను తీర్చిదిద్దితే ఆటలు ఆడుకోవచ్చని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఆట స్థలాల కొరత కూడా అధిగమించొచ్చని ఇది అమలు చేయడం ద్వారా క్రికెట్‌తో పాటు ఇతర ఆటలు ఆడేందుకు వీలుగా ఉంటుందని, చక్కని వేదిక అవుతుందని ధనుంజయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది మంచి ఆలోచన అని, ఈ విధానాన్ని పరిశీలించాలని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు సూచించారు. జంట నగరాల్లో ఈ తరహా క్రీడా వేదికలను అందుబాటులోకి తేవొచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.