రాష్ట్రం లో పదవ తరగతి పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని… మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

రాష్ట్రం లో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణం లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సజావుగా నిర్వహించాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లకు, సంబంధిత అధికారులకు ఆదేశించారు.

బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ,విద్యా శాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన తో కలిసి పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించి నందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు జరుగు పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాల లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ లను ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 90 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2 వేల 600 పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు

పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. కలెక్టర్లు రవాణ, పోలీస్, రెవిన్యూ, వైద్య శాఖల అధికారులు, అప్రమత్తంగా ఉండే విధంగా వారికి సూచనలు జారీ చేయాలనీ అన్నారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

విద్యార్థులకు హాల్ టికెట్ లను వెబ్ సైట్ bse.telangana.gov.in లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి అన్నారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 7370 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 41 కేంద్రాలుఏర్పాటు చేశామని, పోలిస్ స్టేషన్ కు దూరంలో ఉన్న 13 పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాల తరలింపు కోసం 9 రూట్లను గుర్తించామని తెలిపారు. 41 సిట్టింగ్ స్కార్డ్, 2 ప్లయింగ్ స్కార్డ్ లను నియమించమని,సిసి కెమెరాల ఏర్పాటు చేసామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీ లకు, మున్సిపాలిటీలకు అప్పగించామని అన్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు.

జిల్లా లో తేది 10-4 23 నాడు జరిగే సైన్స్ పరీక్ష రోజు మాత్రం ఉదయం 9.30 నుండి 12.50 వరకు పరీక్ష ఉంటుందని , ఇట్టి విషయాన్ని విద్యార్థులు గమనించాలని తెలిపారు.

జిల్లా ఎస్ .పి సృజన మాట్లాడుతూ జిల్లా లో జరిగే పదవ తరగతి పరీక్షల నిర్వహణకు 41 సెంటర్లలో పూర్తి స్తాయి బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రశ్నా పత్రాల తరలింపు కు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తామని, ప్రైవేట్, ప్రభుత్వ సెంటర్లలో అన్ని జాగ్రతలు తీసుకుంటామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో, జిల్లా నుండి డి ఇ ఓ సిరాజ్జుదిన్ , శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శశికళ, ఆర్ టి సి దేవేందర్ గౌడ్, డి పి ఓ శ్యాం సుందర్, ఆర్ టి ఓ పురషోతంరెడ్డి, ఫైర్ అధికారి శ్రీదాసు , సి సెక్షన్ సుపరింతెన్దేంట్ వరలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.