ప్రధాని మోదీతో గంటపాటు సమావేశమైన CM రేవంత్‌, భట్టి

ప్రధాని మోదీతో గంటపాటు సమావేశమైన CM రేవంత్‌, భట్టి

దిల్లీ :

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) దాదాపు గంట పాటు ప్రధాని మోదీ (PM Modi)తో సమావేశమయ్యారు..

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధానితో వారు చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరు గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానిని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.