రైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..

రైతుబంధు అమలుపై కొనసాగుతున్న సందిగ్ధత..

రైతు భరోసా కావాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..

ప్రస్తుతం రైతు బంధు రైతులు పొందుతున్నప్పటికీ..

మళ్లీ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలి – సీఎం రేవంత్.

ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తాం- సీఎం రేవంత్ రెడ్డి.

భవిష్యత్తులో భూమి విస్తీర్ణానికి సీలింగ్ పెట్టే అవకాశం ఉంది- రేవంత్ రెడ్డి.

రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ.

కౌలు రైతులకు సైతం పథకం వర్తింపజేస్తామని కాంగ్రెస్ హామీ.

మీరు రైతా లేదా కౌలు రైతా అనేది దరఖాస్తులో స్పష్టం చేయాలి.

రైతు ఐతే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు నంబర్లు, సర్వే నెంబర్‌, ఎంత విస్తీర్ణం భూమి కలిగి ఉన్నారనేది దరఖాస్తులో రాయాలి.

కౌలు రైతు ఐతే ఎంత మొత్తం సాగు చేస్తున్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలి.

సాగు చేస్తున్న భూమి సర్వే నంబర్‌, పట్టాదారు పుస్తకాల వివరాలు ఇవ్వాలి.

గ్యారెంటీలలో వ్యవసాయ కూలీలకు సైతం ఏటా రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ..

ఈ స్కీంకు అర్హులుగా ఉండాలంటే మీకు ఉపాధి హామీ కార్డు నెంబర్‌ మెన్షన్ చేయాలి.