రష్యా మహిళా కీలక సోత్రధారి..!
గోవా టూ హైదారాబాద్ డ్రగ్స్ సరాఫరా.
షాద్‌నగర్ వద్ద పట్టుబడ్డ ఇద్దరు నిందితులు.
డ్రగ్స్ స్వాధీనం – ఇద్దరు రిమాండ్.
డ్రగ్ సరఫరా చేస్తున్న వారిపై పీడి యాక్ట్ పెడతాం.
షాద్‌నగర్ ఏసిపి “రంగస్వామి” హెచ్చరిక.
రూ. లక్ష విలువైన ఎం.డి.ఎం.ఎ డ్రగ్స్ పట్టివేత.
షాద్‌నగర్ మీడియా సమావేశంలో ఏసిపి రంగస్వామి వెల్లడి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై తీవ్రమైన నిషేధాన్ని విధించిందని ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారిని ఉపేక్షించేది లేదని వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని షాద్‌నగర్ ఏసిపి రంగస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్ పట్టుబడ్డ వ్యవహారంపై వివరాలు వెల్లడించారు.
నిన్న రాత్రి 8 గంటలకు విశ్వసనీయ సమాచారం ప్రకారం రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసిపి రంగస్వామి వెల్లడించారు. కే. ప్రియాంక రెడ్డి అలియాస్ ప్రియా 29 ఏళ్ల యువతితో పాటు ఎం.శ్రీతేజ (29) అనే హైదరా బాదుకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వీరి వద్ద లక్ష రూపాయల విలువైన ఎం.డి.ఎం.