నక్సల్స్,పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ చిన్నారి మృతి
చత్తీస్ ఘడ్ :
ఛత్తీస్‌గఢ్‌లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య సోమవారం సాయంత్రం ఎదురు కాల్పులు జరిగాయి.
ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్జీ సైనికులు బుల్లెట్ గాయా లయ్యాయి. దీంతో క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎన్కౌంటర్లో పలువురు నక్సల్స్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గంగ లూరు పోలీస్‌స్టేషన్ పరి ధిలోని ముతవంటి గ్రామ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.
ఎన్‌కౌం టర్లో ఇద్దరు డీఆర్జీ సైనికులు గాయ పడ్డారు. గ్రామానికి చెందిన ఆరు నెలల చిన్నారి బుల్లెట్ తగిలి చనిపోయింది. అదే సమయంలో బాలిక తల్లి చేతికి బుల్లెట్ గాయమైంది. అదనపు సూపరింటెండెంట్, పోలీసులు సిబ్బంది ఘట నాస్థలానికి చేరుకొని గాయ పడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఎన్కౌంటర్లో భైరంగఢ్ ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్నతో పాటు పలు వురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత డీఆర్జీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది గాలిం పులు చేపట్టారని ఉన్నతాధి కారులు వివరించారు.