చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని యువతి మృతి

చలిమంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని యువతి మృతి

కొమురం భీం జిల్లా తిర్యాని మండలం గిన్నె దారి సాలెగూడా గ్రామానికి చెందిన దేవేంద్ర(31) నిన్న ఉదయం చలిమంట కాగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు తన వేసుకున్న నైటికి నిప్పట్టుకొని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందింది

తిర్యాని ఎస్ఐ సిహెచ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం….

దేవేంద్రకు గత ఆరు నెలల క్రితం కుడిమ్మేత నాగేష్ అనే యువకుడితో పెళ్లయింది దేవేంద్రకు అనారోగ్యానికి గురికావడంతో కొన్ని రోజుల నుండి తల్లిగారింటి ఉంటూ చికిత్స పొందుతుంది దేవేంద్ర ఈరోజు ఉదయం చలి కాగుతున్న సమయంలో తను వేసుకున్న నైటీ కి మంటలు చెలరేగడంతో దేవేంద్ర కేకలు వేసింది ఇంతలో ఇంటిలో ఉన్న తల్లిదండ్రులతో పాటు పక్కింటి వాళ్ళు వచ్చి మంటను ఆరిపారు‌ వారు వెంటనే హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు దేవేంద్ర చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 3మూడు గంటల 50 నిమిషాలకు మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు మృతురాలి తండ్రి మర్సుకోల శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు