తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల కేటాయింపు
తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్, బుద్వేల్ గ్రామ పరిధిలోని 100 ఎకరాలను న్యాయ శాఖకు కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది.
బుద్వేల్లోని 2500 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలోని 100 ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని తాజాగా నిర్ణయించినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ స్థలంలో నూతన హైకోర్టు భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు అన్నీ పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత దాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల తొలగింపు.
గత ప్రభుత్వం నియమించిన గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. 33 జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.