వేప చేట్టుకు పారుతున్న కల్లు… ఆరోగ్యానికి మంచిదంటూ తాగేందుకు ఎగబడుతున్న జనం…

ఈత క‌ల్లు తాగి ఉంటారు.. తాటి క‌ల్లు టేస్ట్ చేసి ఉంటారు…అయితే వేప క‌ల్లు టేస్ట్ తెలుసా మీకు.. ఎప్పుడైనా వేప కల్లుని ..టేస్ట్ చేసారా.. అవును ఇప్పుడు వేప క‌ల్లు గురించే చేప్ప‌బోతున్నాం.. తెలంగాణాలోని ఓ జిల్లాలో ఇప్పుడు ఈ వేప క‌ల్లు ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అటు ఆరోగ్యానికి కూడా మంచిది కావ‌డంతో జ‌నాలు క్యూ క‌డుతున్నారు.. ఇంత‌కి ఎక్క‌డా ఆ వేప క‌ల్లు క‌థ.. ఏమిటి ఎ జిల్లా వాసులను వేప కల్లు ఆకట్టుకుంది తెలుసుకుందాం.

నిజామాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటుచేసుకుంది. వేప చెట్టు నుండి వింతగా ఎవరు గియకుండానే వేప చెట్టు నుండి కల్లు కారడంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ వింత చెట్టు ను చూడటానికి జనం పోటెత్తారు.

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలము కారేపల్లి గ్రామంలో మారుమూల పల్లెటూరు. అక్కడ గత వారం పది రోజుల నుండి వేప చెట్టుకు కల్లు కారడం చూసిన ఆ చెట్టు యజమాని భుమన్న చెట్టుకు బాటిల్ కట్టి వచ్చిన వేప కల్లును సాక పట్టారు.

వేప చెట్టు కల్లు బలే టెస్టుగా ఉందని అంటున్నారు. వేప చెట్టుకు కల్లు వస్తుందని ఆ నోటా ఈ నోటా బయట పడ డంతో జనం వేప చెట్టు కల్లు ను త్రాగడానికి ఆసక్తి చూపుతున్నరు.

ఈ వేప చెట్టు నుండి వస్తున్న కల్లు తాగితే షుగర్ వాతం కి మంచిగ పని చేస్తుందనీ షుగరు, వాతం తగ్గుతున్నాయని గ్రామస్థులు అంటున్నారు.

ఇక వేప క‌ల్లు సేవించ‌డం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్ట‌ర్లు.. దీన్ని సేవించ‌డం వ‌ల్ల క‌ళ్ల స‌మ‌స్య‌ల‌తో పాటు, జీర్ణ స‌మ‌స్య‌లు కూడ న‌యంమ‌వుతాయంటున్నారు… మోతదులో సేవించ‌డం మంచిదంటున్నారు డాక్ట‌ర్లు…