కనుమ వేళ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ 400 మంది వైకాపా కార్యకర్తలకు ఒకొక్కరికి ఫుల్ బాటిల్ మద్యంతో పాటు రెండు కిలోలు తూగే ఓ కోడిని పంపిణీ చేశారు. దీనికి విద్యాసంస్థను వేదికగా చేసుకోవడం స్థానికంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
విశాఖలో ఒక ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో కనుమ పండుగ సందర్భంగా ఈరోజు చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ నివ్వెరపరిచేలా చేసింది.. ఒక కళాశాల తరగతి గదుల్లో ఒక పార్టీ కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే మద్యం బాటిళ్లు, కొందరికి కోడి మాంసం, మరికొందరికి లైవ్ కోళ్లు పంచడం అందరినీ షాక్ కు గురిచేసింది. రాజకీయ నేతలు ఇలాంటివి చేయడం సహజమే కానీ..
విశాఖలో ఒక ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలో కనుమ పండుగ సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటన అందరినీ నివ్వెరపరిచేలా చేసింది.. కళాశాల తరగతి గదుల్లో పార్టీ కార్యకర్తలకు స్థానిక ఎమ్మెల్యే మద్యం బాటిళ్లు, కోడి మాంసం, లైవ్ కోళ్లు పంచడం అందరినీ షాక్ కు గురిచేసింది. రాజకీయ నేతలు ఇలాంటివి చేయడం సహజమే కానీ.. ఏకంగా తనకు చెందిన ఒక కళాశాలలో దాని యజమాని అయిన స్థానిక ఎమ్మెల్యే మందు, మాంసం పంపిణీ చేయడం, ఆ వీడియోలు వైరల్ కావడం విశాఖలో సంచలనంగా మారాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కు చెందిన కాలేజీ క్లాస్ రూముల్లోనే ఫుల్ బాటిళ్ల మద్యాన్ని, కోళ్లను కార్యకర్తలకు పంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనుమ పండగ సందర్భంగా మంగళవారం పార్టీ కార్యకర్తలకు తాను నడుపుతున్న రామబాణం జూనియర్ కాలేజీ ప్రాంగణంలోనే ఫుల్ బాటిల్ చీప్ లిక్కర్ సీసాలను, కేజీ బాయిలర్ కోడి మాంసంతో పాటు కోరుకున్న వారికి లైవ్ కోళ్లను పంచారు.
వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తే.. ఒక తరగతి గదిలో క్రమశిక్షణతో కూర్చున్న కొందరు కనిపిస్తారు. కానీ వీళ్ళు విద్యార్ధులు కారు. వీళ్లంతా ఆ పార్టీ కార్యకర్తలు.. అయితే, మందు బాటిల్స్ ఇస్తున్నారని ఉదయం ఏడు గంటలకే వచ్చి బుద్దిగా కూర్చున్నారు. వీళ్లంతా ఇదే కాలేజీకి ముందు రోజు వచ్చి టోకెన్ లు తీసుకున్న వారు. వారికి టోకెన్లు వారీగా పిలిచి మద్యం, చికెన్ ఇచ్చి పంపారు.
ఎన్నికల స్టంట్ లో భాగంగానే.
ఇదే నియోజకవర్గంలో మొన్న దసరాకి లక్షలు ఖర్చు పెట్టి స్వీట్స్ పంచినా రాని పబ్లిసిటీ.. స్థానిక నేత దొడ్డి బాపూ ఆనంద్ వంద మందికి క్వార్టర్ మందు, కోడిపెట్టను ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వీర ప్రచారం పొందేశాడన్న విషయం విశాఖలో వైరలైంది. అందుకే సులువుగా పబ్లిసిటీ రావాలంటే మద్యం పంపిణీ ఒక్కటే మార్గం అని నేతలకు తలచినట్టుంది. ఈ క్రమంలో బాధ్యత గల ఎమ్మెల్యే స్వయంగా తాము నడుపుతున్న జూనియర్ కళాశాల తరగతి గదుల్లోనే మద్యం పంపిణీ చేసారన్న విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రచారం కోసం కేవలం 600 రూపాయల కన్నా తక్కువ ధరకు దొరికే చౌకబారు మద్యం సీసాలతో పాటు కిలో కోడి మాంసం కలిపి పంచడం ఒక ఎత్తైతే.. తాను మద్యం పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం చేయడం కోసం వేరేవాళ్లు వీడియోలు లీక్ చేశారంటూ చేస్తున్న ఆరోపణలు.. సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి.