తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.

హైదరాబాద్ :

తెలుగు రాష్ట్రాల్లోని అయోధ్య భక్తులకు దక్షిణ మధ్య రైళ్వే శుభవార్త చెప్పింది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్యను దర్శంచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉండటంతో, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిం చింది.

జనవరి 29 తర్వాత తెలంగాణలోని సికింద్రా బాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయో ధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయ వాడ, గుంటూరు, రాజమ హేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.

సికింద్రాబాద్‌ నుండి అయోధ్య కు ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగించ నుండగా, విజయవాడ నుండి అయోధ్య కు రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయ నగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైళ్వే శాఖ అధికారి తెలిపారు.

ఇక, టికెట్ల బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటీసీ కీలక సూచన చేసింది. అయోధ్యకు డైరెక్ట్ రైళ్ల బుకింగ్స్ ప్రారంభం కాలేదని తెలిపింది. సెపరేట్‌గా తమ టికెట్‌లను బుక్ చేసుకో వాలని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్వే శాఖ తెలిపింది.

సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతాయి.

అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి.
కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరు తాయి.

ఈ రైళ్లు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.
విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి నుంచి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు అయోధ్యకు పయనమవుతాయి.

అయోధ్య నుంచి తిరిగి ఆయాచోట్లకు ప్రయాణించనున్నాయి.