నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న CM రేవంత్ రెడ్డి
హైదరాబాద్ :
సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్లో ఆయన పర్యటించను న్నారు.
వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.
ఇదిలా ఉండగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయి.
అదానీ గ్రూప్సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.