గీత గోవిందం హీరోయిన్ రష్మిక ఫేక్ వీడియోను రూపొందించిన గుంటూరు జిల్లా వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించిన ఈమని నవీన్.
సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వీడియో.
దేశవ్యాప్తంగా దుమారం.
గుంటూరు జిల్లాలో నవీన్ ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.
ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోను రూపొందించిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది ఏపీలో అన్న విషయం తాజాగా వెల్లడైంది. నిందితుడ్ని ఈమని నవీన్ అని గుర్తించారు. 24 ఏళ్ల నవీన్ గుంటూరు జిల్లాకు చెందినవాడు. అసభ్యకర రీతిలో రష్మిక డీప్ ఫేక్ వీడియో రూపొందించి, ఆ వీడియో సోషల్ మీడియా వేదికల్లో అప్ లోడ్ చేసింది నవీనే అని వెల్లడైంది.
ఈ కేసు విచారణలో భాగంగా డీప్ ఫేక్ వీడియోలతో సంబంధం ఉందని భావించిన 500కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించామని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేకమంది సోషల్ మీడియా ఖాతాల సొంతదారులను విచారించామని, రష్మిక డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించామని తెలిపారు.