అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్: అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత కొంతకాలంగా కోల్ కతా నుంచి యువతులను తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఫార్చ్యూన్ లాడ్జిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 16 మంది అమ్మాయిలు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 22 ఫోన్లు, రికార్డులను సీజ్‌చేసి లాడ్జికి తాళం వేశారు. యజమాని అఖిల్, మేనేజర్ రఘుపతి, పట్టుబడిన అమ్మాయిలతో పాటు విటులను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలమేరకు చర్లపల్లి జైలుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.