ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువు.. రహదారి గుంత కారణంగా మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి-వేపగుంట రహదారిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
విశాఖపట్నం (పెందుర్తి, వేపగుంట), : ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన నవ వధువు.. రహదారి గుంత కారణంగా మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన విశాఖ నగర పరిధిలోని పినగాడి- వేపగుంట రహదారిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పెందుర్తి ట్రాఫిక్ ఎస్సై జి.రమేశ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపట్నం దరి ఆర్ఆర్ వెంకటాపురానికి చెందిన పెంటకోట వెంకటఅప్పారావు, సబ్బవరం మండలం గుల్లేపల్లికి చెందిన సంతోషి(23) ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబరులో వీరి వివాహం జరిగింది. దంపతులిద్దరూ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుల్లేపల్లి వెళ్లారు. రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో పినగాడి మీదుగా తిరిగి వస్తుండగా చీమలాపల్లి దరి మీనాక్షి కల్యాణ మండపం సమీపంలోని రహదారి గుంతలో వాహనం దిగి అదుపు తప్పింది.
వెనుకాల కూర్చున్న సంతోషి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సహకారంతో 108 వాహనంలో ఆమెను చికిత్స నిమిత్తం