మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దారుణం జరిగింది. సోషల్ మీడియాలో స్నేహం చేసి, ప్రేమ పేరుతో మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రేమ వ్యవహారం పోలీసుల వరకు చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వివాహిత ఇద్దరు పిల్లల తల్లి. ఆమె కంటే 12 సంవత్సరాలు చిన్న వయసు కలిగిన యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితుడయ్యాడు. ఈ స్నేహం ఎంతగా పెరిగిందంటే ఆ యువకుడు తన ఇంటిని వదిలి ఉజ్జయినికి వచ్చి సదరు మహిళతో కలిసి జీవించేంతలా.
ఆ యువకుడు కొన్ని నెలలు ఆ మహిళతో సంతోషంగా గడిపాడు. అయితే ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అందుకు నిరాకరించాడు. దీంతో మహిళ ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తనను పెళ్లికి రప్పించి అత్యాచారం చేశాడని యువకుడిపై ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకుడిపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలు నాగ్‌జిరిలో నివాసం ఉంటున్న 42 ఏళ్ల ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు మహిళా పోలీసులు తెలిపారు. గత సంవత్సరం, ఆమె ఇంటర్నెట్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బార్వే జిల్లా ఓబ్రా కాలనీకి చెందిన 30 ఏళ్ల నీరజ్ కుమార్ శర్మతో స్నేహం చేసింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీని తర్వాత, నీరజ్ జూలై 2023లో ఉజ్జయినికి వచ్చారు. ఏకంగా అతను ఉపాధ్యాయుని ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో టీచర్‌ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. శర్మ చాలా రోజులుగా టీచర్ వద్దే ఉండి, సహాజీవనం చేశారు. ఇటీవల శర్మను పెళ్లి చేసుకోవాలని మహిళ కోరగా, అతడు నిరాకరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ.