స్మగ్లర్ల కొంప ముంచిన రూట్‌ మ్యాప్‌.! తప్పించుకునే క్రమంలో స్మగ్లర్ల కారు బోల్తా.

మహబూబాబాద్‌లో విచిత్ర సంఘటన జరిగింది.

ఆంధ్ర – ఒరిస్సా సరిహద్డులో గంజాయి ప్యాక్ చేసుకున్న స్మగ్లర్లు కారులో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. హైవే మీదుగా వెళ్తే పోలీసులు పట్టుకుంటారని అడ్డదారిలో దూసుకెళ్ళారు. ఈ క్రమంలోనే వాళ్ల రూట్ మ్యాప్ లో ఊహించని ట్విస్ట్ ఎదురయింది.. నెల్లికుదురు సమీపంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ మార్గంలో వెళుతున్న స్మగ్లర్లు…

ఎక్సైజ్ సిబ్బందిని చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రయత్నం బెడిసికొట్టి అడ్డంగా దొరికిపోయారు. కారు ఎస్కేప్ అవుతుండగా గమనించిన ఎక్సైజ్ టాస్క్‌ ఫోర్స్ సిబ్బంది అనుమానంతో వెంటనే అలర్టయ్యారు. కారుని వెంబడించారు… చేజ్ చేసే క్రమంలో గంజాయితో ఉన్న కారు బోల్తా కొట్టింది.. దాంతో బండారం బయటపడింది. ఆ కారు డిక్కీ ఓపెన్ చేసిన ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సిబ్బందికి కట్టల కట్టలు గంజాయి ప్యాకెట్స్ కనిపించాయి. 200 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఈ గంజాయి విలువ దాదాపు 40 లక్షలకు పైనే ఉంటుందని అంచనా వేవశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల విక్రయాలు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ ముఠా ఎక్కడనుండి గంజాయి ఎక్కడికి తరలిస్తున్నారు.. అనే కోణంలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది నిందితులనుంచి కూపీ లాగేపనిలో పడ్డారు.