TS RTC లో డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు… MD సజ్జనార్
హైదరాబాద్ :
తెలంగాణలో త్వరలోనే డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ఉంటుంది అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై ఇటీవల సంస్థ ఎండి సజ్జనార్ కూడా ప్రకటన చేశారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చు కోవాలని టిఎస్ఆర్టిసి యాజమాన్యం నిర్ణయిం చిందని చెప్పారు.
ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు.
వాటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ను చేపట్టను న్నట్లు చెప్పారు.
80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనార్ స్పష్టం చేశారు.