మహబూబ్‌నగర్ రైల్వే పోలీసులు దోపిడీలకు పాల్పడే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిని వ్యక్తి 25 చైన్ స్నాచింగ్ ఘటనలకు, 2 దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో 32ఏళ్ల వయసున్న నిందితుడిపై పలు సెక్షన్ల కింద 28 క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉంది
ఇన్ని నేరాలకు పాల్పడిన నిందితుడి పేరు మైచర్ల గణేష్ గా పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గాజువాక, విశాఖపట్నం వాసిగా గుర్తించారు. మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ వలస వచ్చి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివరాంపల్లిలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. గణేశ్‌ను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు విశాఖ గాజువాక పోలీసులకు అప్పగించారు. కేసు నిమిత్తం అధికారులు నిందితుడిని మహబూబ్‌నగర్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున రిమాండుకు తరలించారు