తెలంగాణరాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన..

ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన..

తెలంగాణరాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొన్ని రోజులుగా పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తారా ? లేక సర్పంచ్‌ల పదవీకాలాన్ని పొడగిస్తారా, పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమిస్తారా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగింది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్‌ ఆఫీసర్లు ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించనున్నారు. కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం గెజిటెడ్‌ అధికారులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించనున్నారు.ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరి ఒకటితో ముగియనుంది. ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు చేయకపోవడంతో గ్రామ పరిపాలన స్పెషల్‌ అధికారుల చేతికి వెళ్లనుంది. ఎన్నికలు నిర్వహించే వరకు స్పెషల్‌ ఆఫీసర్లు కొనసాగనున్నారు. స్పెషల్‌ ఆఫీసర్లుగా ఆయా మండలాల్లోని ఎంపీడీవో, ఎంపీవో, తహిసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, అగ్రికల్చర్‌, మండలంలోని ఇతర ఇంజినీర్లు, ఇతర శాఖల గెజిటెడ్‌ అధికారులను నియమించారు. ఎన్నికల య్యే వరకూ సర్పంచ్‌లను పర్సన్‌ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. సర్పంచ్‌ల సంఘం, సర్పంచ్‌లు కూడా ప్రభుత్వానికి విన్నవించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన వ్యక్తం కాలేదు. గ్రామ సర్పంచ్‌ల అం దరు బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఉన్నారనే అక్కసు, స్పెషల్‌ ఆఫీసర్లను నియమిస్తే గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకుల హవా సాగించవచ్చనే ఉద్దేశంతో స్పెష ల్‌ ఆఫీసర్ల వైపు ప్రభుత్వం మొగ్గు చూ పినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.