కరీంనగర్ :
‘అమ్మా, నాన్న బైబై… సాహితీ సారీరా.. నేను రాత్రి 11 గంటలకు చచ్చిపోతున్నాను’ అంటూ ఆ విద్యార్థిని రాసిన సూసైడ్ లెటర్ చదివిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యతం అవుతున్నారు. మార్కులు తక్కువ వస్తున్నాయని మనోవేధనకు గురైన విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన అక్షిత కరీంనగర్ సమీపంలోని చింతకుంట గురుకుల పాఠశాలలో ఇంటర్ ఫస్టీయర్ చవుతున్న అక్షిత ఆత్మహత్య చేసుకుని మరణించింది. బాలిక ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసింది. ‘సారీ అమ్మ నేను చనిపోతున్నాను, నాకన్న తక్కువ మార్కులు వచ్చిన వాళ్లు ఉన్నారు. కానీ నేను చనిపోతున్నాను. వద్దు నాకీ బ్రతుకు అంటూ అక్షిత ఆ లేఖలో రాసింది. సారీ అమ్మా, నాన్న, సారీ సాహితి.. సారీరా నిన్ను వదిలి వెల్లిపోతున్నాను అంటూ బాలిక రాసిన లేఖను చదివి ప్రతి ఒక్కరు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ‘చనిపోతున్నాను.. సారీ మామ్, డాడీ.. బై’ అంటూ రాసిన అక్షిత తనువు చాలించింది. చదువు విషయంలో వెనకబడి ఉన్నానన్న మనో వేధన ఆమెను వెంటాడినట్టుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన తరువాత వాస్తవాలు వివరిస్తామని చెప్పారు.
సంరక్షణ లేకే…
అక్షిత ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల యంత్రాంగంపై పలు ఆరోపణలు చేస్తున్నారు. సంరక్షణ సరిగా లేకపోవడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని, సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు కూడా తనకు పాఠశాలలో ఇబ్బందిగా ఉందని తనకు చెప్పిందని అక్షిత తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది. తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.