మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్…

హైదరబాద్ :

మాజీ మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్…

మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధ సత్యాలు, సంస్కారం లేని భాష, వికారమైన ధోరణి వితండవాదం , నిన్నటి ప్రెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లో కనిపించినయి.

తెలంగాణ ప్రజలు నిన్న ఆయన ధోరణి చూసి ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటారా అని అసహ్యించుకున్నారు.

నిన్న ఉదయాన్నే పద్మ అవార్డులకు జరిగిన సన్మాన సభలో ప్రముఖుల సమక్షంలో తాను ఇక ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని ప్రజలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి సాయంత్రం అయ్యే సరికి చాలా నీచమైన పద్ధతిలో కే సి ఆర్ గారి పట్ల వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.

రేవంత్ రెడ్డి మాట తీరు ఏమిటన్నది.., మాట ఇస్తె నిలుపుకునే తీరు ఏమిటన్నది రెండూ తేలిపోయాయి.

నీచమైన పద్దతిలో తెలంగాణ సాధించిన, తొలి సీఎం మీద ఆయన వ్యాఖ్యలు దరుందమ్

ప్రాజెక్టుల విషయంలో మీరెన్ని మాటలు చెప్పినా సారాంశం ఒక్కటే పదేండ్లలో కేసీఆర్ అప్పగించలేదు, మీరు ఇలా ప్రభుత్వం లోకి రాగానే అలా అప్పగించేశారు. ఇది మీరు ఎంత దాచేసినా దాగని సత్యం.

కె ఆర్ ఎం బి రెండు మీటింగులు అయ్యాయి. మినట్స్ ప్రకారం, నెల రోజుల్లో అప్పగిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది.

సి ఆర్ పి ఎఫ్ పర్మిషన్ తో ప్రాజెక్టుల వద్దకు ఇంజినీర్లు వెళ్ళాలని అందులో ఉంది.

రెండు రాష్ట్రాలు మెయింటేన్ చేయాలి. అని మినట్స్ లో కూడా ఉన్నాయి.

ఇదే విషయాన్ని పత్రికలలో రాశాయి. లేదంటే పత్రికల్లో వచ్చిన వార్తలు మీరు ఖండించాలి కదా.

ఇంత అన్యాయం జరిగితే ఏం చేస్తున్నారు అని నేను ప్రెస్ మీట్ పెట్టీ ప్రశ్నిస్తే కదలిక వచ్చింది.

ఇప్పుడు మా తప్పు లేదు అని మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు అప్పగించిందేకు ఒప్పుకున్నది మీరు కాదా.

KRMB రెండో మీటింగ్ హైదరాబాద్ లో ఫిబ్రవరి 1 న జరిగాయి. ఇందులో కూడా స్పష్టం చేశారు.

దీని మినట్స్ ప్రకారం, పవర్ హౌజ్ ఔట్ లెట్స్ ఇవ్వడానికి రాఫ్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నారు.

ప్రాజెక్టులు అప్పగించింది నిజం కాకుంటే ఉద్యోగులు, వారి జీతాల చెల్లుపు దాకా ఎందుకు చర్చ వచ్చింది.

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. అన్ని అబద్ధాలు. అబద్దాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపడం సరికాదు.

రెండు రాష్ట్రాల ఇ ఎన్ సి లు అప్పగిస్తున్నాము అని చెప్పారు.

పదేళ్లలో మేము అప్పగించలేడు. రెండు నెలల్లో ఢిల్లీ చేతిలో పెట్టీ అడుక్కుతినే పని చేశారు.

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.

16 వ మీటింగ్ మినట్స్ లో తెలంగాణ ఒప్పుకోలేదు అని ఉంది. కానీ తప్పుగా చెప్పారు. ఎక్కడా ఒప్పుకోలేదు, పెండింగ్ లో ఉందని ఉంది.

17 మీటింగ్ లో కూడా ఎక్కడా మేము అప్పగిస్తామని లేదు. పచ్చి అబద్ధాలు మాట్లాడారు సీఎం.

కేసీఆర్ స్వయంగా సంతకాలు చేశారు అన్నారు. పచ్చి అబద్దం. ఇంతకంటే జుటా సీఎం ఉంటారా.

సీఎం మాటలు జర్నలిస్టులు చెక్ చేసుకుని రాయాల్సిన పరిస్థితి వచ్చింది.

పచ్చి అబద్ధాలు సచివాలయంలో కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదు.

దగుల్బాజీతనం సహించరు. అబద్దాలను ప్రజలు, మేధావులు గుర్తించాలి.

పోతిరెడ్డి పాడు విషయంలో పదవులకు ఆశ పడి పెదవులు ముసుకున్నది మేము కాదు.

మేము ఆ జీఓ వచ్చినప్పుడు మీ ప్రభుత్వంలోనే లేము. పెదవులు ముసుకున్నది మీ పక్కన ఉన్న నాయకులే.

మేము పోరాటం చేశాం. అసెంబ్లీలో అడ్జార్న్ మోషన్ ఇచ్చాం. స్తంబిప్ చేశాం.

గడ్డి పోచల్లగా నాడు పదవులు వదులుకున్నాము.
మేము జూలై 4, 2005 మంత్రి పదవులకు రాజీనామా చేస్తే, 13 సెప్టెంబర్ 2005 జీఓ వచ్చింది.

మేం పదవుల్లో ఉన్నపుడు పోతితెడ్డి జీఓ వచ్చిందని రేవంత్ ఎలా మాట్లాడారు

పీజేఆర్ మాట్లాడితే అందరూ పెదవులు మూసుకొని ఉన్నారు. ఆనాడు మాతో గొంతు కలిపింది కాంగ్రెస్ లో ఉంది పీజేఆర్ ఒక్కడే.

పోతిరెడ్డిపాడు మీద 40 రోజులు అసెంబ్లీ స్తంభింప చేశాం. పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీది.

ఉల్టా చోర్ కొత్వాల్ కే డాంటే లాగా ఉన్నావు.

కేసీఆర్ సంతకం పెట్టాడు అని ఎలా అంటారు. అసలు హాజరు కానేలేదు.

రెండో అపెక్స్ కమిటీ మినట్స్ లో క్లియర్ గా చెప్పారు. రాయలసీమ, పోతిరెడ్డి పాడులపై అభ్యంతరాలు చెప్పారు.

ప్రాజెక్టులు ఇచ్చింది ఎవరు. ఎవర్ని చెప్పులతో కొట్టాలి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

మేము సంస్కరంగా మాట్లాడుతున్నాం. ప్రజల కోసం నిలబడతాం.

మేము పుట్టిందే తెలంగాణ కోసం. ఎక్కడా కాంప్రమైజ్ కాము.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పోరాట చేసింది కేసీఆర్ గారు. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్ లో తెలంగాణ వ్యతిరేకించింది అని క్లియర్ గా ఉంది.

విభజన చట్టం రూపొందించి మీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే పోరాటంలో ఉన్నారు.

బిల్లు గురించి ఆయన తెలుసుకోవాలి. చదువుకోవాలి. వితండవాదం చేస్తున్నారు. మీరు పెట్టిన బిల్లు అది మీకు లేదా బాధ్యత.

ఉత్తమ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ.. అన్యాయం జరిగింది అంటున్నారు. తెలంగాణ ఉద్యమానికి కారణమే నీళ్ళు కదా. జయశంకర్ గారిని, అమరుల త్యాగాలను తప్పు పట్టే విధంగా వ్యాఖ్యలు.

ఉద్యమ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు ఉత్తమ కుమార్ గారు

మీ పాలనలో జరిగిన అన్యాయాలు కేసీఆర్ గారు సరిచేశారు.

తెలంగాణ నీళ్ళు మీరు ఆంధ్రాకు తరలించి ప్రయత్నం చేస్తే, కేసీఆర్ గారు పంట పొలాలకు తరలించారు.

సబ్జెక్ట్ లేక గాయ్ గత్తర చేసారు సీఎం. భూతులతో బుల్దొజ్ చేసే ప్రయత్నం చేస్తే ఊరుకోం.

ప్రిపేర్ కాక అడ్డంగా దొరికిపోయారు. మైక్ ఇవ్వండి తప్పకుండా సమాధానం చెబుతాం.

వచ్చేసారి అసెంబ్లీకి ప్రిపేర్ రావాలి. చర్చ చేద్దాం. మంచి చెడూ అన్ని తెలుస్తాయి.

మా ఎంపిలు గజేంద్ర శకవత్ గారిని కలిసి ప్రాజెక్టులు తీసుకోవద్దని కోరితే ఆ చర్చ అయిపోయింది అన్నారు.

పట్టపగలు పచ్చి అబద్ధాలు సరికాదు. ప్రభుత్వాన్ని పక్కగా నిలదీస్తాం.

గతంలో ఇలాగే మాట్లాడారు. మాకు మైక్ ఇవ్వలేదు. పారిపోయారు. ఇప్పుడు మైక్ ఇవ్వండి.

రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.

అఖిల పక్షం తీసుకు వెళ్తారా వెళ్ళండి మేము వస్తాం.

తప్పు జరిగితే తెలంగాణకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ముందుకు రావాలి.