జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయం లో జగిత్యాల MLA డా సంజయ్ కుమార్ గారి మీడియా సమావేశం

జగిత్యాల జిల్లా BRS పార్టీ కార్యాలయం లో జగిత్యాల MLA డా సంజయ్ కుమార్ గారి మీడియా సమావేశం

ఎమ్మేల్యే డా.సంజయ్ మాట్లాడుతూ….

జగిత్యాల పట్టణ నూక పల్లిలో 4520 డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి,520 ఇండ్ల కు పూర్తి స్థాయిలో కరెంట్ స్తంబాలు,ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి,టి ఆర్ నగర్ వద్ద 7 కోట్ల తో సంపు ఏర్పాటు చేసి,సరస్వతి టెంపుల్ వద్ద ఓవర్ హెడ్ టాంక్ కట్టి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడం జరిగింది…

4000 వేల ఇండ్ల కు 14 కోట్ల 80 లక్షల తో మిషన్ భగీరథ ఇన్ ట్రా పైప్ లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చింది .

మౌలిక సదుపాయాలు సీసీ రోడ్డు,సెప్టిక్ ట్యాంక్,డ్రైనేజీ ల నిర్మాణం కోసం మాజీ మంత్రి కేటీఆర్ సహకారం తో 25 కోట్ల నిదులు మంజూరు చేయటం జరిగింది.

రాష్ట్రం లో ఎక్కడా లేని విధంగా జగిత్యాల లో కెసిఆర్,కవితక్క,కేటీఆర్ ల సహకారం తో 240 కోట్ల తో 4520 డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చెప్పట్టడం జరిగింది.
దేశంలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తం లో ఎక్కడా నిర్మాణం చేయలేదు అని అన్నారు.

కెటిఆర్ గారు భూమి పూజా చేశారు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మేల్యే హోదా లో కూడా పాల్గొన్నారు.

గతంలో ఎప్పుడూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించిన సందర్భం లేదు..

నిన్న సందర్శించి 3 నెలల లో పూర్తి చేస్తామని చెప్పడం పత్రికల్లో చదివాం..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా జనవరి లో కలవడం వారు అధికారులకు నిధుల మంజూరుకు సిపార్స్ చేయటం జరిగింది .

ఇందిరమ్మ ఇండ్ల పథకం 2009 లో నుకపల్లి లో 100 ఎకరాల్లో స్థలం సేకరించి, ప్రారంభించడం జీవన్ రెడ్డి గారు చేసిన చాలా పెద్ద తప్పు అని అన్నారు.

మౌలిక వసతులు లేని ప్రాంతం లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం,అక్కడ స్థలం సేకరించడం వల్ల లబ్ది దారులకు మౌలిక సదుపాయాలు లేక అక్కడికి వెళ్ళ లేని పరిస్తితి…

గత ప్రజా ప్రతినిధులు ధరూర్ క్యాంప్ లో 260 ఎకరాల్లో మంచి స్థలం సేకరించినా ఉపయోగించుకోలేదు.

పేద ప్రజలకు నూక పల్లి లో కేటాయించడం మీ తప్పే…

చల్ గల్ లో జీవన్ రెడ్డి గారు రాజకీయాలకు రాక ముందే వలంతరి క్షేత్రం ఉందని,చల్ గల్ లో కూడా ఇందిరమ్మ ఇండ్లు ఏర్పాటు అవకాశం ఉన్నా స్వార్థ పూరితంగా నుకపాల్లి లో ఏర్పాటు చేశారని అన్నారు.

75 సం,రాలలో 42 సం,రాలు మీరే జగిత్యాల లో అధికారం లో ఉన్నారు కదా ఎన్ని ఇండ్లు పేదల కోసం కట్టించారు చెప్పాలి అని అన్నారు…

ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక్కన పెట్టడం అనేది తప్పు,అగ్గి పెట్టె లాంటి ఇందిరమ్మ ఇల్లు స్థానం లో పెదలు ఆత్మ గౌరవం తో ఉండాలని డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 లో డబల్ బెడ్ రూం ఇండ్ల ప్రాజెక్ట్ శంకుస్థాపన ..

డబల్ బెడ్ ఇండ్ల నిర్మాణం తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ కల…

జే ఎన్ టి యు, న్యాక్ కేంద్రం సైతం గుట్ట లల్లో ఏర్పాటు పూర్తిగా జీవన్ రెడ్డి వైఫల్యమే..

డబల్ బెడ్ రూం కాంట్రాక్టర్ పని వదిలి వెళ్తే, కరోనా వల్ల కొంత ఇబ్బంది అయినా ఇండ్ల నిర్మాణం పూర్తి చేశాం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హౌసింగ్ మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి లను ఎమ్మెల్సీ రమణ తో వెళ్లి కలవడం,నిదులు మంజూరు చేయాలని కోరడం జరిగింది….

కేసిఆర్ నగర్ ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు..

ఇంకా 800 ఇండ్లు పంపిణీ కి మిగిలే ఉన్నాయి..

కొంత మంది అర్హులు ఉన్నా కూడా సాంకేతిక కారణాల తో ఇల్లు పొందలేని పరిస్తితి ఉందని పరిష్కరించాలని కోరడం జరిగింది అని అన్నారు….

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పై రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ లో ఉన్న 3920 కోట్ల విలువైన లోన్ లను మాఫీ చేసిన ఘనత కెసిఆర్ ది…

ఇందిరమ్మ ఇళ్ల లో మీ హయాంలో ఇచ్చిన నాడు నుకపల్లి లో ప్రజలు ఉండే పరిస్తితి ఉందా,ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు..

ఏనుగు పోయి తోక మిగిలినట్లు,
ఎన్నికల కోడ్ వల్ల డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొంత ఆలస్యం అయ్యింది అన్నారు.

22 కోట్ల తో మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి…

520 ఇండ్లకు రోడ్డు కోసం మీ హయాంలో ఒక దాత ఇచ్చిన భూమి నేడు ఆక్రమించారు….మాజీ మంత్రి గారు దీనిపై స్పందించాలి ,రోడ్డు కు పరిష్కారం చూపాలి అని డ్రైనేజీ సమస్య కు పరిష్కారం లభిస్తుంది అని అన్నారు.

డబల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం లో గతం లో ఎన్నడు లేని సమీక్షలు,సందర్శనలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్న…

ఎంపి ఎన్నికలు దృష్ట్యా
ఓట్ల రాజకీయం చేయవద్దు అని హితవు పలికారు .

ఇందిరమ్మ ఇళ్లకు ఆపాము అని అనడాన్ని ఖండిస్తున్నా

ప్రజలు మీకు సరిపడా అవకాశాలు ఇచ్చారు…

ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్తితి లేదు…

జగిత్యాల పట్టణం లో ప్రజలు బి అర్ ఎస్ పార్టీ కి పట్టం కట్టారు.మిమ్మల్ని ఓట్ల రూపంలో తిరస్కరించారు అని గుర్తు చేశారు.

రాజకీయాలకు అతీతంగా పేద వారి ఇండ్ల నిర్మాణనికి, వారు అక్కడ నివసించడానికి సహకరిద్ధాం అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్,పట్టణ పార్టీ ఉప అధ్యక్షులు ఓల్లెం మల్లేశం,కౌన్సిలర్ లు బొడ్ల జగదీష్, జుంబర్తి రాజ్ కుమార్,అల్లే గంగసాగర్,నాయకులు సింగ రావు, అడువాల లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.