అపాయంలో ఉన్న ఆడవారిని రక్షించాల్సిన పోలీసులే వారిపాలిట కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. రక్షణకోసం వచ్చిన మహిళల పట్ల వారు ప్రవర్తించే తీరు మొత్తం పోలీసు వ్యవస్థపైనే నమ్మకం పోయేలా చేస్తుంది.
తాజాగా సిద్ధిపేట జిల్లాలో ఓ ఎస్ఐ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పెళ్లిచేసుకుంటానని మోసం చేయడంతో బాధిత మహఙళ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో అరుణ్ అనే వ్యక్తి ఎస్ఐగా ఫిబ్రవరి 16 వరకు విధులు నిర్వహించాడు.
ఇటివలే కామారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యాడు. ఎస్ఐ అరుణ్ పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై యువతి ఎస్ఐ అరుణ్ పై సైదాబాద్‌లోని ఉన్నత స్థాయి అధికారులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేసింది. అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అరుణ్ మోసం చేశాడని యువతి పేర్కొంది. అరుణ్ గతంలో హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ కేసుపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో తన ఫోన్ నంబర్‌ను ఎస్ఐ అరుణ్ తీసుకుని ప్రేమించానని చెప్పాడని తెలిపింది.