శివ ధ్యానం చేసిన ఊర పిచ్చుక
జగిత్యాల జిల్లా ధర్మపురి :
మహాశివరాత్రి రోజు జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈరోజు వింత ఘటన జరిగింది.
ఒక ఇంటిలో కుటుంబ సభ్యులు శివ పూజ చేస్తుండగా పూజా మందిరంలోకి ఊర పిచ్చుక వచ్చింది. పూజ మందిరంలో చాలా సమయం కదలకుండ శివధ్యానంలో ఉన్నట్లు పిచ్చుక అలాగే ఉంది.
మానవులే కాదు పశువులు పక్షులు కూడ ముక్తి మార్గం కోసం శివారాధన చేస్తాయనే భావన కలిగిందని ఆ ఇంటి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
ఊర పిచ్చుకలు ఇంటిలోకి వస్తేనే అదృష్టంగా భావిస్తాము మనం అటువంటిది ఏకంగా పూజా గదిలోకి ఊర పిచ్చుక రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని ఆ ఇంటి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.