సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల…

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.

ఏపీ, తెలంగాణలో ఓకే రోజు ఎన్నికలు.

ఎన్నికల తేది : మే 13

ఎన్నికల ఫలితాలు: జూన్ 4

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.

జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం.

ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొననున్నారు.

55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నాం.

దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు.

85 ఏళ్లు నిండిన వారికి ఓటు ఫ్రమ్ హోమ్.

ఎన్నికల విధులకు దూరంగా వాలంటరీలు, తాత్కాలిక సిబ్బంది.

టీవీ, సోషల్ మీడియా ప్రకటనపై నిరంతర పర్యవేక్షణ

ఏప్రిల్ 1 వరకు ఓటర్ జాబితాలో మార్పులకు అవకాశం.

దేశవ్యాప్తంగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ.

సి విజిల్ యాప్ ద్వారా ఓటర్లు ఫిర్యాదు చేసుకోవచ్చు.

ఈడి, ఐటి సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచాం.

ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లలో కూడా సోదాలు.

బ్యాంకు లావాదేవీలపై కూడా నిఘా.

నగదు పంపిణీపై ప్రత్యేక నిఘా.

ప్రతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్.

ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ.

ప్రలోభాలను, కానుకలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు.

ఎన్నికల ప్రచార నుంచి పిల్లలు దూరంగా ఉండాలి.

విదేశీ సరిహద్దులున్న రాష్ట్రాల్లో డ్రోన్ లతో నిఘా.

కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు.

దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు: కేంద్ర ఎన్నికల సంఘం.