వెలుగులోకి సరికొత్త మోసం.. సాయం చేస్తున్నట్లే నమ్మించి కేసుల్లో ఇరికిస్తారు…జర జాగ్రత ఫ్రండ్స్…అసలు స్టొరీ ఏంటి అంటే
ధనం మూలం ఇదం జగత్.
ధనమే అన్నిటికీ మూలం…ధనము తోనే అన్ని…
ప్రపంచంలో ఏ మోసమైన డబ్బు కోసమే జరుగుతుందని అందరికీ తెలుసు.
తాజాగా మన సొమ్మును తస్కరించే ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది.
మనీ మ్యూల్ పేరుతో పిలిచే ఈ నయా మోసం బాధితుల నుంచి డబ్బును స్వీకరించి వేరే వ్యక్తికి బదిలీ చేసే వంకతో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తారు.
సాధారణంగా ఎవరైనా మోసానికి గురైతే మొదటగా పోలీసులను ఆశ్రయిస్తారు.
వారు మోసగించిన సొమ్ము ఏ ఖాతాకు వెళ్లిందో?
అని ముందుగా కనుగొంటారు.
పోలీసులకు దొరక్కుండా కొంత మంది ఇతరుల ఖాతాల నెంబర్లు ఇచ్చి ఆ ఖాతా నుంచి సొమ్ము బదిలీ చేసుకుంటున్నారు.
ఇందుకు ప్రతిగా వారు ఖాతా నెంబర్లు ఇచ్చి, సొమ్ము బదిలీ చేసుకున్నందుకు కొంత నగదును చెల్లిస్తున్నారు.
మనీ మ్యూల్స్ పిలిచే వీరు అక్రమ కార్యకలాపాలు, మోసాలకు పాల్పడే ఇతర మోసగాళ్లకు సహాయం చేస్తున్నారని ఇటీవల వెల్లడైంది.
అనేక సందర్భాల్లో మనీ మ్యూల్స్ జాబ్ ఆఫర్లు, ఆన్‌లైన్ ప్రకటనలు లేదా సోషల్ మీడియా సందేశాలు వంటి విభిన్న పద్ధతుల ద్వారా మోసగాళ్లకు చిక్కుతున్నారు.
ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించడంంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో డబ్బును లాండర్ చేయడానికి ఉపయోగపడుతన్నారు.
మనీ మ్యూల్స్ అంటే ఎవరు?
నగదు లావాదేవీల మోసాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి?
వంటి విషయాలను తెలుసుకుందాం.
మనీ మ్యూల్స్ అమాయకుల ఫోన్ నెంబర్లు సేకరించి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వేరే ఇతర కారణాలతో వారి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయిన సొమ్మును నిర్దేశిత ఖాతాకు బదిలీ చేయించుకుంటూ ఉంటారు. ఇలా చేసినందుకు ఆ డబ్బులో కొంత భాగాన్ని చెల్లింపుగా ఇస్తారు. బహుళ బ్యాంక్ ఖాతాలు లేదా తప్పుడు గుర్తింపులను ఉపయోగించడం వంటి గుర్తింపును నివారించడానికి మోసగాళ్లు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తారు. ఎఫ్‌బీఐ యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ప్రజలు డబ్బు మ్యూల్స్‌గా ఎలా మారతారు? ఈ పద్ధతిలో ఎవరు పాల్గొనే ప్రమాదం ఉంది అని వివరించింది.
టార్గెట్ వారే నేరస్థులు తరచుగా విద్యార్థులు, ఉద్యోగార్ధులు లేదా డేటింగ్ వెబ్‌సైట్‌లను ఉపయోగించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. అయితే డబ్బు సంపాదించే పథకాల్లో పాల్గొనడానికి వారు ఎవరైనా సంప్రదించవచ్చు. వ్యవస్థీకృత క్రైమ్ గ్రూపులు, మనీ మ్యూల్స్ రిక్రూటర్‌లు యువ తరాలపై దృష్టి సారించడం ప్రారంభించారని యూరోపోల్ పేర్కొంది. ముఖ్యంగా 12 నుంచి 21 మధ్య వయస్సు ఉన్న వ్యక్తులను, సాధారణంగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అధికారులు ఈ పోస్ట్‌లను తొలగించినప్పటికీ మోసగాళ్ళు తప్పుడు ప్రకటనలను సులభంగా రీపోస్ట్ చేయవచ్చు.
మనీమ్యూల్స్ మోసం ఇలా మనీ మ్యూల్‌గా ఉండకుండా ఉండటానికి ఈ చట్టవిరుద్ధ కార్యకలాపానికి ఎవరైనా మిమ్మల్ని రిక్రూట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించడం చాలా ముఖ్యం.
మిమ్మల్ని ఉద్యోగం పేరుతో సంప్రదించే వ్యక్తి జీమెయిల్, యాహూ, హాట్ మెయిల్ లేదా అవుట్ లుక్ ఈ-మెయిల్ సేవలను ఉపయోగిస్తాడు.
మీరు మీ పేరు మీద లేదా మీరు చేసిన కంపెనీ పేరు మీద బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది.
మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు సంపాదించి, దాన్ని వేరే చోటికి పంపడం మీ పని.
డబ్బు ఏసీహెచ్, మెయిల్ లేదా వెస్ట్రన్ యూనియన్ లేదా మనీ గ్రామ్ వంటి సేవలను ఉపయోగించి బదిలీ చేయాలి.
మీరు బదిలీ చేసిన డబ్బులో కొంత భాగాన్ని మీరు ఉంచుకోవచ్చని చెబుతారు.