ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా :

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది.

ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహ బూబాబాద్ లోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న క్రమంలో సోమ వారం ఉదయం తుది శ్వాస విడిచింది.

విషయం తెలుసుకున్న మహబూ బాద్ జిల్లా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మృతదే హాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..