నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లకు ఓటర్లు బుద్ధి చెప్పాలని..
బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ బలం, గళం, శక్తి బీఆర్ఎస్ అన్న కేసీఆర్.. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందని అన్నారు. నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు.
”బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఏ పనీ కాలేదు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కాలేదు. కానీ దేశ్ కా సత్యనాష్ అయింది. మోదీ ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు.. మీకు మాత్రం 30 లక్షలు బీజేపీ ఎంపీ ఇచ్చాడట.. వచ్చాయా? మన గోదావరి మనకే ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ ను మొట్టమొదటిసారి గెలిపించారు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు.
కరెంటు కోతలు వచ్చాయి. మిషన్ భగీరథ నీళ్లు పోయాయి. 5 నెలల్లో అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు పథకాలు రాలేదు. రైతుబంధు రాలేదు. పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చింది. నేను రోడ్డు మీదికి రాగానే రైతుబంధు పడుతోంది. తెలంగాణ బలం, గళం, శక్తి బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది.
2 లక్షల రుణమాఫీ వచ్చేదాకా కొట్లాడదాం. రేవంత్ రెడ్డికి దేవుడి గుళ్ల మీద ఓట్లు, కేసీఆర్ కు తిట్లు తప్ప వేరే పని లేదు. బీజేపీ వారు చెప్పేదంతా ట్రాష్. ఇక్కడి బీజేపీ ఎంపీ చాలా ఖతర్నాక్. ఈసారి ఖచ్చితంగా ఓడించాలి. ముస్లిం మైనారిటీలు ఆలోచించాలి. మీరు సరైన నిర్ణయం తీసుకోకుంటే బీజేపీ వారు గెలుస్తారు. యువకులు ఆవేశంతో ఓటు వేయకుండా విజ్ఞతతో ఆలోచించాలి. నేను హిందువునే. కానీ అన్ని వర్గాల కోసం పని చేస్తా. నా బిడ్డ కవితను జైల్లో పెట్టినా భయపడను. లొంగిపోయే ప్రసక్తి లేదు. మోదీకి 250 వస్తే మస్తు. మనం రాష్ట్రంలోని అన్ని సీట్లు గెలిస్తే నిర్ణయాత్మక శక్తిగా ఉంటాం” అని కేసీఆర్ అన్నారు.
BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు.. ఒక్క రోజు కస్టడీలో క్రిశాంక్‌ను ప్రశ్నించిన పోలీసులు. క్రిశాంక్‌కు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. క్రిశాంక్‌కు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు..