హైదరాబాద్ జిల్లాలో కొట్టుకు వచ్చిన రెండు మృత దేహాలు
హైదరాబాద్ :
హైదరాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేట లోని నాలాలోకి రెండు మృత దేహాలు కొట్టుకుని వచ్చాయి. అందిన సమాచా రం మేరకు వివరాలు ఇలా వున్నాయి.
బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నీ అనుకుని కూకట్ పల్లి నాలా. అమీర్ పేట నాలాలు ప్రవహిస్తుంటాయి. అయితే మంగళ వారం రాత్రి కురిసిన వర్షాలకు ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు నాలాలో కొట్టుకుని వచ్చాయి.
వీరు ప్రమాద వశాత్తూ నాలాలో పడి చనిపోయా రా? లేక రోడ్లపైనే వుండే మ్యాన్ హోల్స్ నీ గుర్తించ లేక అలా అక్కడ పడిపోయి నాలా లోకి చేరుకున్నారా ఆన్న విషయాలు తెలియ రాలేదు .
మృతి చెందిన వారి వయ స్సు సుమారు 40నుంచి 45సంవత్సరాలు వుంటుం దని ప్రత్యక్ష సాక్షుల సమాచారం.
తెల్లారే సరికి నాలా లో రెండు మృతదేహాలు కొట్టుకుని రావడం తో ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వాసులు బేగంపేట పోలీసులకు సమాచారం అందించారు.
ఎస్సై జయచందర్ సంఘ టనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తు న్నారు….