KCR రోడ్ షోను విజయవంతం చేయాలి.., MLA గంగుల కమలాకర్
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా రేపు కరీంనగర్ లో నిర్వహించే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ శ్రేణులను కోరారు. బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి గంగుల హాజరై పలు సూచనలు చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ప్రతిరోజు గడపగడపకు వెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, భాను ప్రసాద్ రావు, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు , కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్, పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, తిప్పర్తి లక్ష్మయ్య, తోట తిరుపతి,సుంకిశాల సంపత్ రావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు. జమీలుద్దిన్ , సీని