వధువు తల నరికి ఆత్మహత్య చేసుకున్న వరుడు…

వధువు తల నరికి ఆత్మహత్య చేసుకున్న వరుడు…

కర్ణాటక :

నిశ్చితార్థం చేసుకుంటున్న అమ్మాయి మైనర్ బాలిక కావడంతో ప్రభుత్వ అధికా రులు నిశ్చితార్ధాన్ని అడ్డుకు న్నారు.

దీనిని జీర్ణించుకోలేక పోయిన వరుడు ఆమెను నరికి చంపాడు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన సంచల నమైంది. పోలీసుల కథనం ప్రకారం..

కొడుగు జిల్లాలోని సూర్లబ్బి గ్రామానికి చెందిన మీనా (16)తో స్థానికుడైన ప్రకాశ్ (32)కు వివాహం చేయాల ని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా,

బాలికకు ఈ పెండ్లి ఇష్టం లేదు. తనకు పరిచయం ఉన్నవారి ద్వారా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికా రులకు సమాచారం అందించింది. వెంటనే బాలిక ఇంటికి చేరుకున్న అధికారులు నిశ్చితార్థాన్ని అడ్డుకున్నారు.

బాల్య వివాహం నేరమని ఆమె తల్లిదండ్రులకు కౌన్సె లింగ్ ఇచ్చారు. నిశ్చితార్థం అడ్డుకోవాలని, పెళ్లికూతురే అధికారులకు సమాచారం ఇచ్చిందని అనుమానించిన ప్రకాశ్.. ఆగ్రహంతో ఊగి పోతూ ఆమె ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడిచేశాడు.

ఆపై మీనాను అటవీ ప్రాం తంలోకి లాక్కెళ్లి తల నరికి హత్య చేశాడు. మొండాన్ని అక్కడే వదిలేసి పరార య్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బాలికను హత్యచేసిన ప్రాంతానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రకాశ్ కనిపిం చాడు. కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…