భయ్యా అర్జెంట్‌గా కాల్ చేసుకోవాలి అంటే మీ ఫోన్ ఇస్తున్నారా..? ఖతం
ఇది మాయా ప్రపంచం.. ఎవరు ఏ రకంగా మనల్ని మోసం చేస్తారో తెలీదు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విచ్చలవిడిగా పెరిగిపోయింది.
ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎలా కొత్త పుంతలు తొక్కుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేటుగాళ్లు రోజుకో కొత్త ఐడియాతో జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. చదవుకున్నవాళ్లను కూడా ఈజీగా చీట్ చేస్తున్నారు. నిమిషాల్లో ఖాతాల్లో సొమ్మును నిల్ చేస్తున్నారు. ఇలా ఎన్నెన్నో మోసాలు. తాజా అప్ డేట్ ఏంటి అంటే.. మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎవరైనా వినొచ్చు.. అలానే మీ మెసేజ్‌లు చదువుతూ ఉండవచ్చు. మీరు అలెర్ట్ కాకపోతే.. మీ ప్రైవసీకి పెద్ద ప్రమాదమే.
మనం రకరకాల పనుల నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాం. అక్కడ ఎవరో తెలియని వ్యక్తి వచ్చి.. తన ఫోన్ పాడయ్యిందని లేదా బ్యాలెన్స్ లేదని.. తన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు కాల్ చేయాలని మన ఫోన్ అడిగితే.. అయ్యో అని వెంటనే ఇచ్చేస్తాం. కానీ.. అవతలి వ్యక్తి కంత్రీగాడు అయితే మాత్రం చాలా ప్రమాదంలో పడ్డట్లే. మనకు తెలియకుండానే క్షణాల్లో ఆ ఫోన్ కాల్ ఫార్వార్డింగ్, మెసేజ్ ఫార్వార్డింగ్ ఆప్షన్‌ను వారు మార్చేస్తారు.
జస్ట్.. ఫోన్ కీ ప్యాడ్ మీద 401 అని టైప్ చేసి వాళ్ల ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి డయల్ చేస్తారు. అంతే.. ఇలా చేస్తే మనకు తెలియకుండానే మన కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా ఆ నంబర్‌కు ఫార్వర్డ్ అవుతుంటాయి. దీనివల్ల మన నార్మల్ మెసేజెస్ మాత్రమే కాకుండా.. మన UPI, బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన అన్ని ఓటీపీలు కూడా ఆ నెంబర్‌కు ఫార్వర్డ్ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ మీ ఫోన్‌లో కాల్స్, మెసేజెస్ ఇప్పటికే వేరే నంబర్‌కు ఫార్వర్డ్ అవుతుంటే వెంటనే స్టాప్ చేయాలంటే. ముందుగా మీ ఫోన్ కీప్యాడ్లో *#21# అని టైప్ చేసి, డయల్ చేయండి. ఇలా చేస్తే మీ ఫోన్‌లో కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ అవుతున్నాయా? లేదా అనేది స్క్రీన్ మీద చూపిస్తుంది.
. మీ ఫోన్ కాల్స్, మెసేజెస్ ఫార్వర్డ్ అవుతుంటే.. ఆప్షన్ ఎనేబుల్ అయినట్లు చూపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ ఆప్షన్ డిసేబుల్ చేసుకోవాలి. దీనికోసం.. మీ కీప్యాడ్లో ##002# అని టైప్ చేసి, డయల్ చేయాలి. ఆపై వెంటనే.. ఫార్వర్డ్ ఆప్షన్ వెంటనే డిసేబుల్ అయిపోతుంది.