CM యోగి సంచలన ప్రకటన… మరో ఆరు నెలల్లోనే…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే.. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుందని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేని పాక్ నిర్వహించలేదని, అది భారత్‌లో విలీనమవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు.
‘‘ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ స్థితిలో ఆ దేశం పీవోకేని నిర్వహించలేకపోతోంది. అక్కడి ప్రజలు భారత్‌లో చేరాలని బలంగా కోరుకుంటున్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే.. ఆరు నెలల్లోనే పీవోకే భారత్‌లో భాగమవుతుంది’’ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో నవభారత నిర్మాణం చూశామని.. సరిహద్దుల్లో భద్రతని కట్టుదిట్టం చేసి ఉగ్రవాదాన్ని అరికట్టామని అన్నారు. మూడేళ్లుగా పాక్‌లో అనేకమంది ఉగ్రవాదులు హతమయ్యారని, వాటి వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉన్నట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొంటున్నాయన్నారు. భారత్‌కు బీజేపీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, పూర్తి అంకితభావంతో పని చేస్తుందని చెప్పారు.
ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రామ్‌లల్లా అనుమతించరని యోగి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమే తమ మొదటి లక్ష్యమన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని సభ్యులకు ఒక విజన్ గానీ.. భారత్‌ని అభివృద్ది చేయాలన్న లక్ష్యం గానీ లేదని దుయ్యబట్టారు. అయోధ్యలో ఆలయాన్ని వ్యతిరేకించే వారు.. ఇటలీలో రాముడు, హనుమంతుడి ఆలయాలు నిర్మించాలని కాంగ్రెస్‌ని ఉద్దేశించి అన్నారు. ఓటర్లు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పేదలు ఆకలితో ప్రాణాలు కోల్పోయారని, కానీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తోందని సీఎం యోగి చెప్పుకొచ్చారు..