సోషల్ వార్… రాజకీయాలపై సోషల్ మీడియా ప్రభావం
ప్రచారం నుంచి ఫలితాల దాకా..
ప్రచార అస్త్రంగా మారిన వైనం
విమర్శలు, ప్రతి విమర్శలకు వేదిక
ప్రత్యేక పేజీలు, గ్రూపులతో హల్చల్
కామెంట్లకు ప్రత్యేక టీంలు
అనుకూలమైన సర్వేలు షేరింగ్
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సగటు మనిషి సోషల్ మీడియాకు కేటాయిస్తున్న సమయం చాలా ఎక్కువ. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రా గ్రామ్, తదితర సోషల్ మీడియాలో ప్రజలు ఎక్కువగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రస్తుతం సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఎన్నికలు జరిగితే ప్రచారం నుంచి ఫలితాల దాకా నాయకులు ప్రజలను నేరుగా సంప్రదించే వారు. సోషల్ మీడియా కాలం వచ్చాక ఎన్నికలు వచ్చాయంటే చాలు సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ప్రచారం నుంచి ఫలితాల దాకా అన్నీ పార్టీల నాయకులు సోషల్ మీడియాపైనే ఆధారపడుతున్నారు. నాయకుల గెలుపోటములను సైతం సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది అంటే అతిశయోక్తి కాదు.
రాష్ట్రంలో ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్ని కలు, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీ జేపీ పార్టీలు పోటీ పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పార్లమెంట్ ఎన్ని కల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే పార్టీల అభ్య ర్థుల ప్రకటన నుంచి ఫలితాల దాకా ఆయా పార్టీల నాయకులు సోషల్ మీడియాను ఎంతో వాడుకు న్నారు. తమకు సీటు రావడం కోసం ఆయా నియోజకవర్గాల్లో తమకే బలం ఉందని అభ్యర్థులు వారి వారి అనుచరులతో సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన తరువాత ఆయా పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రచారం నిర్వహిం చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నికల బరిలో గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకున్నారు.
ప్రత్యేక పేజీలు, గ్రూపుల ఏర్పాటు
ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రా గ్రామ్‌లను ఉపయోగించుకున్నారు. వీటి కోసం ప్రత్యేక టీం లను సైతం ఏర్పాటు చేసుకున్నారు. వాట్సాప్‌లలో ప్రత్యేక గ్రూపులను క్రియేట్ చేసి వారికి అనుకూ లమైన పోస్టులతోపాటు ప్రత్యర్థులకు నెగిటివ్ అయ్యే పోస్టులను ప్రచారం చేశారు. అలాగే ప్రత్యే కంగా వీడియోలు తయారు చేయించి వాట్సాప్‌లో స్టేటస్ కూడా పెట్టి ప్రచారం చేసుకున్నారు. ఇక ఫేస్బుక్లో అయితే విస్తృతంగా ప్రచారం నిర్వ హించారు. అభ్యర్థుల పేర ప్రత్యేక పేజీలు పెట్ట డం, ప్రత్యే గ్రూపులు క్రియేట్ చేయడం చేసి జో రుగా ప్రచారం నిర్వహించారు. ఏకంగా పోస్టులకు కామెంట్లు పెట్టడానికి కూడా ప్రత్యేకంగా కొందరిని నియమిుంకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఆయా పార్టీల అధినాయకుల నుంచి మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు సైతం సోషల్ మీడియాలో అక్టివ్‌గా ఉంటున్నారు. రాజకీయంగా నెలకొంటున్న పరిణామాలపై పోస్టులు పెడుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ట్విటర్ వేదికగా ట్విట్లు, రీ ట్విట్లతో నాయకుల మధ్య ఒక రకమైన వార్ కూడా నడుస్తోందని చెప్పవచ్చు. ఒకరి పోస్టుపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి ఉస్మా నియాలో కరెంట్ సమస్యలపై పోస్టు చేయడం.. ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే విష యంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు గాను బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి క్రిశాంక్ జైలుకు వెళ్లాడు. ఇలా ఆయా పార్టీల నాయకులు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.
అన్నీ పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు
ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయి. ఇవి చాలా క్రీయా శీలకంగా పనిచేస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కీలకంగా పనిచేస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విభాగాలు ప్రచారం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీల తప్పులను, అధికార పార్టీ చేస్తున్న సంక్షే మం, అభివృద్ధి, ఇతర కార్యక్రమాలను అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికా రంలోకి రావడానికి సోషల్ మీడియా విభాగం కూడా ఒక బలమైన కారణమని రాజకీయ విశ్లేష కులు భావించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సోషల్ మీడియా కీలకంగా పని చేసింది. ఇక ఫలితాలు రావాల్సి ఉండగా.. వివిధ సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలను, ఆయా పా ర్టీలు ఇంటర్నల్‌గా చేయించుకున్న సర్వేల ఫలితా లను, అలాగే తమకు ఎన్ని సీట్లు వస్తాయి.. ఏఏ అ భ్యర్థి గెలుస్తాడు.. తదితర విషయాలను సైతం సో షల్ మీడియాలో ఆయా పార్టీల నాయకులు జోరు గా ప్రచారం చేసుకుంటున్నారు. తమదే అంటే త మదే అధికారం అని.. తమకే ఎక్కువ సీట్లు వస్తా యి.. అంటే తమకే వస్తాయి అని సోషల్ మీడియా వేదికగా తమ బలబలాలను నిరూపించుకుంటు న్నారు. ఏదిఏమైనా తమ జీవితంలో భాగమైన సోషల్ మీడియా ఎన్నికల్లో ఆయా పార్టీల గెలు పునకు ‘ప్రచార అస్త్రం’గా మారుతోంది. ఎవరూ ఎంత ఉపయోగించుకుంటే వారికి అంత లాభం చేకూర్చుతుంది అనడంతో ఎలాంటి సందేహం లేదు.