నేటి సంఘటనలు… ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

నేటి సంఘటనలు..ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం.

దినోత్సవాలు కాదు అమ్మకాలను అడ్డుకోండి…!

ప్రజల ప్రాణాలను అరేంజ్ చేసే వాటిపై చర్యలు ఎందుకు తీసుకోరు?

సామాన్య ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వాలకు,అధికారులకు అంత అలుసా?

సరైన ప్రభుత్వాలు సరైన అధికారులైతే ప్రజల ప్రాణాలను కాపాడటానికి కృషి చేయండి.!

రంగారెడ్డి జిల్లా బ్యూరో:అదేదో గ్రామాల్లో వాడుక బాషలో ఉన్న ఒక సామెత గుర్తుకు వస్తుంది ఇలాంటి సమయాల్లో.. అదేంటంటే గుమ్మిల గింజలు గుమ్మీలనే ఉండాలి, పిల్లలు మాత్రం దుడ్డేలోలే(బలంగా)కావాలంటా అని ఎనకటికి ఎవడో అన్నట్లుగా ఉంది ప్రభుత్వాల విధానం,తీరు..ఎందుకంటే ప్రజలకు అవి చేస్తాం, ఇవి చేస్తాం కానీ అడ్డమైన డ్రగ్స్, పొగాకు, మధ్యం,గుట్కాలు మాత్రం తయారు చేసి యువత,గ్రామీణ ప్రజల ఆరోగ్యం, జీవితాలను మాత్రం పాడుచేస్తాం అన్నట్లు ఉంటుంది వీరి ఆలోచన విధానాలు. మరి ఇంకేందండి ఇలా అనకపోతే ఇంకెలా…మనుషుల ప్రాణాలు,ఆరోగ్యం నాశనం చేసేవి తయారు చేయకుంటే సరిపోతుంది కదా!ఇది కాదని మధ్యం, సిగరెట్, డ్రగ్స్, తీసుకుంటే,తాగితే లంగ్స్,ఊపిరి(తిత్తులు)పిత్తులుపోతాయి, గుండెకు ముప్పు,అంటారు కానీ కంపెనీలలో తయారు చేయకుండా చేస్తే ఇవన్నీ చెప్పనవసరం లేదు,ప్రచారం అవసరమె లేదు.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా… ఈరోజు ఒక మహత్తరమైన మంచి రోజంట ఒకసారి తెలుసుకోండి చదవండి…ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.ఈ ప్రచారం పొగాకు యొక్క ప్రమాదాలు మరియు ఆరోగ్యంపై దాని ప్రతికూల ప్రభావం, అలాగే ముఖ్యంగా యువతకు ఉద్దేశించిన నికోటిన్ పరిశ్రమ యొక్క దోపిడీ గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ పొగాకు సంక్షోభం మరియు అంటువ్యాధి కారణంగా సంభవించే వ్యాధులు మరియు మరణాలకు ప్రతిస్పందనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సభ్య దేశాలు 1987లో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని రూపొందించాయి.

ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 1987లో WHA40.38 తీర్మానాన్ని ఆమోదించింది, ఏప్రిల్ 7ని “ప్రపంచ ధూమపాన నిరోధక దినోత్సవం”గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. తర్వాత, WHA42.19 రిజల్యూషన్ 1988లో ఆమోదించబడింది,ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం పొగాకు వినియోగం కారణంగా 8 మిలియన్ల మరణాలను నివేదించింది.

దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్షయ మరియు ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల వంటి శ్వాసకోశ రుగ్మతలకు పొగాకు ప్రధాన కారణం. 2008లో, డబ్ల్యూహెచ్ఓ ఎలాంటి ప్రకటనలు లేదా పొగాకు ప్రచారాన్ని నిషేధించింది…మనుషులైతే( మనుషులం)అయితే జీవితం పట్ల సరైన జాగ్రత్త తీసుకొని మెలుగుతాం మెలగాలని కోరుకుంటున్నాం…