హైదరాబాద్ కు తెగిపోయిన ఏపీ బంధం
AP: రాష్ట్ర విభజన జరిగి ఇవాల్టికి పదేళ్లు గడిచాయి.
2 తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో AP బంధం ముగిసింది.
ఇక హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే సొంతం కానుంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన ఆస్తులన్నింటినీ తెలంగాణకు అప్పగించారు.
కానీ ఇప్పటికీ విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.
కృష్ణ, గోదావరి జలాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు, ఉద్యోగుల కేటాయింపు వంటి సమస్యలు ఉన్నాయి.
2014లో రాష్ట్ర విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది.
కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది.
అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు.
తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు.
కానీ మరో పదేళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు