నేటి నుండి పెరుగనున్న టోల్ గేట్ చార్జీలు
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి న వేళ వాహనదారులకు బిగ్ షాక్ తగులనుంది. దేశవ్యా ప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు సగటున 5 శాతం పెరగనున్నాయి.
అయితే ఎంపి ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రా ధికారిక సంస్థ,ఎన్హెచ్ఏఐ తాత్కాలికంగా వాయిదా వే సిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. కాగా, కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీ ల పెంపు అంశాన్ని ఈసీ వద్దకు తీసుకెళ్లింది. దీంతో ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఆదేశించింది.
దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఏడో విడత పోలింగ్ ముగి యడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. దీంతోనే ఎన్నికల కోడ్ ముగిసింది. తాజాగా ఎన్హెచ్ఏఐ ఈ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది.
ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల టోల్పై
ఒక వైపు రూ.5లు, ఇరువైపులా రూ.10లు
పెరిగిన టోల్ ఛార్జీలు జూన్ 3వ తేదీ అంటే నేటి నుంచి అమల్లోకి రానున్నాయన్న మాట,
పెంచిన ధరలు 2025 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. నేషనల్ హైవేలపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5లు, ఇరు వైపులా కలిపి రూ.10లు, చిన్నపాటి కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.10లు, ఇరువైపులా కలిపి రూ.20లు అదేవిధంగా..
బస్సులు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.25లు, ఇరువైపులా కలిపి రూ.35లు, పెద్ద ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.35లు, ఇరువైపులా కలిపి రూ.50ల వరకు పెంచారు. నెలవారీ పాస్ రూ.330 నుంచి రూ. 340లకు పెరిగింది…..