పాత బస్తీ బాద్ షా ఎవ్వరు❓
హైదరాబాద్ :
హైదరాబాద్ లోక్‌సభ స్థానం ఫలితంపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
హైదరాబాద్ లోక్‌సభ స్థానం 1984 నుంచి ఈరోజు వరకూ అది ఓవైసీ అడ్డాగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో పతంగ్‌ను పటాపంచలు చేసి… కమలం వికసించాలని విశ్వప్రయత్నం చేసింది.
మాధవీలత పోటీతో.. హైదరాబాద్ పోరు.. దేశవ్యాప్తంగా ఆకర్షించింది. హైదరాబాద్‌లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అత్యధిక సార్లు 6 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇప్పటివరకూ అతని కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ నాలుగుసార్లు గెలుపొందారు. అంటే గత 40 ఏళ్లుగా హైదరాబాద్ లోక్‌సభను అడ్డాగా చేసుకుని ఓవైసీ కుటుంబం పాలిస్తోంది.
మరోవైపు హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ అభ్యర్థి మాధవీలత తొలి సారి పోటీ చేస్తుండటం.. నాలుగుసార్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్న అసద్‌పై తొలిసారి పోటీచేస్తున్న మాధవీలత గెలుపుధీమా వ్యక్తం చేస్తున్నారు.
నేషనల్ మీడియాను సైతం ఆకర్షించింది. కౌంటింగ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉంది. మొన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ సైతం హైదరాబాద్ ఓవైసీకె అడ్డగా ఉండనుందని వెల్లడిం చాయి.
అయితే ఈసారి అసద్ మెజారిటీకి గండి పడే అవకాశం ఉన్నట్టు పలు సర్వే సంస్థలు వెల్లడిం చాయి…