2020… వ్యవసాయ భూమిలో 10వ శతాబ్దపు సూర్య భగవానుడి విగ్రహం కనుగొనబడింది

2020… వ్యవసాయ భూమిలో 10వ శతాబ్దపు సూర్య భగవానుడి విగ్రహం కనుగొనబడింది

ప్రపంచవ్యాప్తంగా పురావస్తు మ్యూజియంలో భద్రపరచాల్సిన శిల్పం

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలగోడు గ్రామంలో హరిజనవన్నూరప్ప వ్యవసాయ భూమిలో 10వ శతాబ్దానికి చెందిన సూర్య భగవానుడి (సూర్య) రాతి విగ్రహంలభ్యమైంది.

వన్నూరప్ప కొడుకు నాగేంద్ర పొలాన్ని దున్నుతుండగా, అతని నాగలి రెండు చేతులలో రెండు తామరపూలతో రెండు అడుగుల గ్రానైట్ రాతి విగ్రహానికి తగిలింది.
సమీపంలో ఇలాంటి శిల్పాలు మరికొన్ని ఉండవచ్చని స్థానికులు తెలిపారు.

ఈ విషయంపై స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు వెంటనే సమాచారం అందించి శివనాగిరెడ్డి సూచన మేరకు అనంతపురంలోని పురావస్తు మ్యూజియంలో విగ్రహాన్ని భద్రపరచాలని సూచించారు.

వెంటనే రాయదుర్గం హెరిటేజ్ అసోషియేషన్ సెక్రటరీ గూడెకోట శివకుమార్‌కు సమాచారం అందించగా, ఆయన విగ్రహాన్ని పరిశీలించి, శుద్ధి చేసిన అనంతరం దాని చిత్రాలను చరిత్రకారుడు ఈమని శివ నాగిరెడ్డికి పంపారు.

కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈఓ. చరిత్రకారుడు, విగ్రహం యొక్క శిల్ప శైలి ఆధారంగా, ఇది నొలంబ కాలం నాటిదని నిర్ధారించారు.

1. నాలుగు సంవత్సరాలైనా ఈ విగ్రహం ఇంకా మ్యూజియం ఎందుకు చేరుకోలేదు.
2. విక్రమ్ కనుగొన్న రోజు పురావస్తు శాఖ వారు ఈ విగ్రహాన్ని మ్యూజియం కి తరలిస్తామని ఇప్పటివరకు ఆ విగ్రహాన్ని ఎందుకు తమ ఆధీనంలోకి తీసుకోలేదు.
3. అంతర్జాతీయ మార్కెట్లలో ఇలాంటి పదవ శతాబ్దం విగ్రహాలు కొన్ని కోట్ల విలువ చేస్తాయి అటువంటిది ఎవరికి తెలియకుండా ప్రభుత్వానికి తెలియ చేయకుండా ఎక్కడ కూడా దీని గురించి. లిఖితపూర్వకంగా భద్రపరచకుండా ఈ విగ్రహాన్ని ఎవరికి ఇచ్చేశారు.
4. ఇప్పటికైనా పురావస్తు శాఖ వారికి ఈ విగ్రహం ఎవరి ఆధీనంలో ఉందో తెలుసా తెలిస్తే ఎందుకు తేలేదు ఎవరి ఆధీనంలో ఉన్న నాలుగు సంవత్సరాలుగా ఆ విగ్రహాన్ని మరో విగ్రహంతో మార్చలేదన్న గ్యారెంటీ ఏమిటి.
5. ఈ పూర్తి వివరాలు పూర్తి కథనం ఇలాంటి కోట్ల విలువ చేసే విగ్రహాలు మన జిల్లాలో ఇంకా ఎన్నో కనుగొన్న అవి ప్రభుత్వ ఆధీనంలో లేకపోవడం మన మ్యూజియంలోకి చేరకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా దీనిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ విగ్రహాన్ని ఎవరి దగ్గర ఉందో కనిపెట్టి దాన్ని మన అనంత మ్యూజియంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నాం.