ఉద్యోగాల పేరిట మోసం చేసిన నలుగురు నిందుతులు అరెస్ట్… ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ
నిరుద్యోగ యువత ఆర్ధిక అవసరాలను అసరాగా చేసుకొని తమ మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన నలుగురు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టూ టౌన్ ఇన్స్‌పెక్టర్ బాలకృష్ణ తెలిపారు.
లక్ష యాబై వేలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ సూపర్వైజర్లుగా ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి, ఏడుగురు వ్యక్తుల పేర్లతో నకిలీ అపాయింట్మెంట్ ఉత్తర్వులు నిందితులు సృష్టించారని తెలిపారు.
నిందుతులు :
1) బొమ్మ పూర్ణచంద్రరావు r/o YSR కాలనీ ఖమ్మం,
2) దివ్వెల వెంకట మధుసూదన్ రావు, r/o కమాన్ బజార్ ఖమ్మం,
3) కొత్తపల్లి సత్యనారాయణ r/o ముస్తఫా నగర్ ఖమ్మం,
4) విజ్జగిరి శ్రీనివాస్ జమ్మిబండ ఖమ్మం,
ఈ నలుగురిని ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం నగరంలోని కమాన్ బజార్లో అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నిందుతుల నుండి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ కాఫీలు, ఒక కంప్యూటర్, రెండు సెల్ ఫోన్స్, స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
ఔట్సోర్సింగ్ సూపర్వైజర్లుగా ఉద్యోగాలు కోసం బాధితులు ఎవరు కూడా నిందుతులకు డబ్బులు చెల్లించ లేదని ఈ సందర్భంగా తెలిపారు.